TSPSC Group 2 & 3 New Exam Dates 2023 : గ్రూప్‌-2 & 3 కొత్త ప‌రీక్ష తేదీలు ఇవే.. ఈ సారి మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) గ్రూప్‌-2 కొత్త ప‌రీక్ష తేదీల‌ను ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 29,30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్‌-2 పరీక్షలను టీఎస్‌పీఎస్సీ రీషెడ్యూల్‌ చేసింది.
TSPSC Group 2 and 3 Exam Dates Details 2023

నవంబర్‌ 2,3 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ గ్రూప్‌-2 ప‌రీక్ష‌ ఉదయం 10గంటల నుంచి 12.30 గంటల వరకు; మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనున్నాయి. పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి హాల్‌ టికెట్లను టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ లో అందుబాటులో ఉంచనున్నట్టు అధికారులు తెలిపారు.

☛ APPSC/TSPSC Group-2 Jobs Success Tips 2023 : గ్రూప్ -2లో అభ్య‌ర్థులు ఎక్కువ‌గా చేసే లోపాలివే.. వీటిని అధిక‌మిస్తే.. విజ‌యం మీదే..!

గ్రూప్‌–2 పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలికింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షలను నిర్వహించాలని స్పష్టంచేసింది. ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచనలు చేశారు. గ్రూప్‌–2 పరీక్షను వాయిదా వేసే అంశంపై టీఎస్‌పీఎస్సీ యంత్రాంగంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. మిగతా పరీక్షలకు అభ్యర్థులు సన్నద్ధమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. 

అక్టోబర్‌, న‌వంబ‌ర్‌లోనే గ్రూప్‌-3 ప‌రీక్ష కూడా..?

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించే.. గ్రూప్‌-3 ప‌రీక్ష‌ను అక్టోబర్‌, న‌వంబ‌ర్‌లో నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేర‌కు టీఎస్‌పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రూప్-3 విభాగంలో 1,375 పోస్టులకు గాను 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 390 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

☛ చ‌ద‌వండి: TSPSC Group 3 Exam Pattern : 1365 గ్రూప్‌-3 ఉద్యోగాలు.. ప‌రీక్షా విధానం ఇదే..

ఇప్పటికే రెండు, మూడుసార్లు చర్చించి, ఎన్నికలకు ముందే పరీక్ష నిర్వహించాలనే అభిప్రాయానికి కమిషన్‌ వచ్చినట్టు సమాచారం. మరో వారం, పది రోజుల్లో గ్రూప్‌-3 పరీక్ష తేదీలను కమిషన్‌ ప్రకటించనున్నట్టు తెలిసింది. అక్టోబర్‌ నెలలోనే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, ఐబీపీఎస్‌తోపాటు మిగతా పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని పరిగణనలోకి తీసుకొని గ్రూప్‌-3 పరీక్ష తేదీలను పరిశీలిస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అక్టోబర్‌ రెండు లేదా మూడో వారంలో పరీక్ష నిర్వహించాలని కమిషన్‌ భావిస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నికలలోపే పరీక్షలన్నీ పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు.

☛ TSPSC Group 2 Exam Preparation Tips: గ్రూప్‌–2.. సక్సెస్‌ ప్లాన్‌

#Tags