TS Government Jobs: 10,105 ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి గ్రీన్‌సిగ్నల్‌.. అత్య‌ధిక పోస్టులు ఈ శాఖ‌లోనే..

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల‌ జాతర కొన‌సాగుతోంది.
TS Government Jobs Notification 2022

ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసిన వారు మొదలుకొని.. డిగ్రీ, ఆపై చదువుకున్న వారిలో మెజారిటీ నిరుద్యోగుల దృష్టి ఈ 80వేల ఉద్యోగాలపైనే ఉంది.  ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మరో 10,105 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి లభించింది. ఈ మేరకు పలు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జూన్ 17వ తేదీన (శుక్రవారం) ఉత్తర్వులు జారీ చేశారు. శాఖల వారీగా జీవో నంబర్‌ 83 నుంచి 97 వరకు మొత్తం 15 జీవోలను విడివిడిగా జారీ చేశారు. ఈసారి అనుమతి ఇచ్చిన వాటిలో 9,096 పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకు లాల్లోనే ఉన్నాయి.

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!

డీఎస్సీ ద్వారా..
ఇక, మిగిలిన శాఖల పరిధిలోకి వచ్చే 995 పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా, మరో 14 పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. గతంలో అనుమతించిన 35,220 పోస్టులకు తోడు ఇప్పుడు 10,105 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో మొత్తం 45,325 పోస్టులకు అనుమతి లభించినట్టయింది. కాగా, ఈ పోస్టులకు అనుమతి ఇవ్వడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే మరిన్ని పోస్టులకు అనుమతి వస్తుందని శుక్రవారం తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

తాజాగా ఆర్థిక శాఖ అనుమ‌తి ఇచ్చిన పోస్టులు ఇవే..

శాఖ ఉద్యోగాల సంఖ్య భర్తీ చేసే సంస్థ
మహిళా, శిశు సంక్షేమం 14 డీఎస్సీ
మహిళా, శిశు సంక్షేమం 251 టీఎస్‌పీఎస్సీ
వికలాంగ, వృద్ధుల శాఖ 71 టీఎస్‌పీఎస్సీ
జువెనైల్‌ వెల్ఫేర్‌ 66 టీఎస్‌పీఎస్సీ
మైనార్టీ గురుకులాలు 1,445 టీఆర్‌ఈఐఆర్‌బీ
బీసీ గురుకులాలు 3,870 టీఆర్‌ఈఐఆర్‌బీ
బీసీ సంక్షేమ శాఖ 157 టీఎస్‌పీఎస్సీ
ట్రైకార్‌ 1 టీఎస్‌పీఎస్సీ
గిరిజన సహకార సంస్థ 15 టీఎస్‌పీఎస్సీ
గిరిజన సంక్షేమ శాఖ 24 టీఎస్‌పీఎస్సీ
ట్రైబల్‌ గురుకులాలు 1,514 టీఆర్‌ఈఐఆర్‌బీ
టీసీఆర్‌టీఐ 16 టీఎస్‌పీఎస్సీ
గిరిజన సంక్షేమ శాఖ 78 టీఎస్‌పీఎస్సీ
టీఎస్‌డబ్ల్యూఈఆర్‌ఐ సొసైటీ 2,267 టీఆర్‌ఈఐఆర్‌బీ
దళిత అభివృద్ధి శాఖ 316 టీఎస్‌పీఎస్సీ

TSPSC: 9,168 గ్రూప్-4 ఉద్యోగాలు.. ప‌రీక్ష సిలబస్ ఇదే..!

ఈ ఏడాది (2022) తెలంగాణ‌లో భ‌ర్తీ చేయ‌నున్న గ్రూప్స్-1,2,3,4 ఉద్యోగాలు ఇవే..:

గ్రూపు

పోస్టులు

గ్రూప్‌– 1

503

గ్రూప్‌– 2

582

గ్రూప్‌– 3

1,373

గ్రూప్‌– 4

9,168

TSPSC Group-1 Syllabus: 503 పోస్టులు.. గ్రూప్‌–1 ప‌రీక్ష‌ల‌ సిల‌బ‌స్ ఇదే..

శాఖలవారీగా భర్తీ చేసే పోస్టుల సంఖ్య..

శాఖ

పోస్టులు

హోం శాఖ

18,334

సెకండరీ విద్య

13,086

వైద్యారోగ్య కుటుంబ సంక్షేమం

12,755

ఉన్నత విద్య

7,878

వెనుకబడిన తరగతుల సంక్షేమం

4,311

రెవెన్యూ

3,560

ఎస్సీ అభివృద్ధిశాఖ

2,879

నీటిపారుదల, కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌

2,692

గిరిజన సంక్షేమం

2,399

మైనారిటీ సంక్షేమం

1,825

పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్‌ టెక్నాలజీ

1,598

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి

1,455

కారి్మక, ఉద్యోగ

1,221

ఆర్థిక శాఖ

1,146

మహిళాశిశు, వికలాంగులు, వయోవృద్ధులు

895

మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి

859

వ్యవసాయం, సహకార

801

రవాణా, రోడ్లు మరియు భవనాలు

563

న్యాయ శాఖ

386

పశుసంవర్థక, మత్స్య శాఖ

353

సాధారణ పరిపాలన

343

పరిశ్రమలు, వాణిజ్యం

233

యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక

184

ప్రణాళిక శాఖ

136

ఆహార, పౌర సరఫరాల శాఖ

106

లెజిస్లేచర్‌

25

ఇంధన

16

మొత్తం

80,039

TSPSC: 1,373 గ్రూప్-3 ఉద్యోగాలు.. ఎగ్జామ్స్‌ సిలబస్ ఇదే..!

జిల్లాస్థాయి పోస్టుల సంఖ్య ఇలా..

జిల్లా

పోస్టులు

హైదరాబాద్‌

5,268

నిజామాబాద్‌

1,976

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి

1,769

రంగారెడ్డి

1,561

కరీంనగర్‌

1,465

నల్లగొండ

1,398

కామారెడ్డి

1,340

ఖమ్మం

1,340

భద్రాద్రి కొత్తగూడెం

1,316

నాగర్‌కర్నూల్‌

1,257

సంగారెడ్డి

1,243

మహబూబ్‌నగర్‌

1,213

ఆదిలాబాద్‌

1,193

సిద్దిపేట

1,178

మహబూబాబాద్‌

1,172

హన్మకొండ

1,157

మెదక్‌

1,149

జగిత్యాల

1,063

మంచిర్యాల

1,025

యాదాద్రి భువనగిరి

1,010

భూపాలపల్లి

918

నిర్మల్‌

876

వరంగల్‌

842

ఆసిఫాబాద్‌

825

పెద్దపల్లి

800

జనగాం

760

నారాయణపేట

741

వికారాబాద్‌

738

సూర్యాపేట

719

ములుగు

696

జోగుళాంబ గద్వాల

662

రాజన్న సిరిసిల్ల

601

వనపరి

556

మొత్తం

39,829

జోనల్ పోస్టుల లెక్క ఇదీ..

జోన్‌

పోస్టులు

జోన్‌–1 కాళేశ్వరం

1,630

జోన్‌–2 బాసర

2,328

జోన్‌–3 రాజన్న

2,403

జోన్‌–4 భద్రాద్రి

2,858

జోన్‌–5 యాదాద్రి

2,160

జోన్‌–6 చారి్మనార్‌

5,297

జోన్‌–7 జోగుళాంబ

2,190

మొత్తం

18,866

మల్టీజోన్‌ పోస్టుల లెక్క ఇదీ..

కేడర్‌

పోస్టులు

మల్టీజోన్‌–1

6,800

మల్టీజోన్‌–2

6,370

మొత్తం

13,170

వయోపరిమితి ఇలా..
☛ ఓసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు
☛ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల వయోపరిమితి 49 ఏళ్లు
☛ దివ్యాంగ అభ్యర్థుల వయోపరిమితి 54 ఏళ్లు
☛ ఎక్స్‌ సర్వీస్‌మెన్లకు వయోపరిమితి 47 ఏళ్లు
☛ హోంశాఖలో వయోపరిమితి మినహాయింపు లేదు

#Tags