TS Government Librarian Jobs 2024 : 1000 లైబ్రరీ పోస్టులకు నోటిఫికేష‌న్‌..? త్వరలోనే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పద్మశ్రీ డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ జయంతి సందర్భంగా.. ఆగ‌స్టు 12వ తేదీన (సోమవారం) అఫ్జల్ గంజల్ లోని కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ గ్రంథాలయంలో ఉన్నటువంటి వివిధ‌ ఖాళీల వివరాలు ఇవ్వాలని, సీఎంతో మాట్లాడి.. తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ ద్వారా ఆ పోస్టులను జాబ్ క్యాలెండర్‌లో పెట్టించేలా చూస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ నాయకత్వంలో.. కేరళలో కంటే ఎక్కువ గ్రంథాలయాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. 

తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ నాయకత్వంలో.. కేరళలో కంటే ఎక్కువ గ్రంథాలయాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలని మంత్రి రియాజ్‌ను కోరగా.., రియాజ్ సానుకూలంగా స్పందించారు. 

➤☛ 40000 Above Central Government Jobs 2024 : నిరుద్యోగులకు పండ‌గే పండ‌గ‌.. మ‌రో 40000ల‌కు పైగా ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌..! వివ‌రాలు ఇవే..

1000 లైబ్రరీ పోస్టులకు త్వరలోనే..

గ్రేడ్-1, 2, 3లో 1000 లైబ్రరీ పోస్టులకు తగ్గకుండా త్వరలో నోటిఫికేషన్లు వచ్చేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ లైబ్రరీ ఛైర్మన్ డా.రియాజ్‌ను లైబ్రేరియన్ విద్యార్థులు కోరారు. డా.రియాజ్ ఆధ్వర్యంలో.. తెలంగాణ పబ్లిక్ లైబ్రరీ డెవలప్‌మెట్ ఫోరం హైద‌రాబాద్‌లో నిర్వహించిన వన్ డే వర్క షాప్‌లో పాల్గొన్న విద్యార్థులు ఈమేరకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేలా న్యాయం చేయాలన్నారు.

➤☛ Telangana Job Calendar 2024 Released : గుడ్‌న్యూస్‌.. జాబ్‌ కేలండర్ విడుద‌ల‌.. భర్తీ చేయ‌నున్న పోస్టులు ఇవే..!

#Tags