Female Government Jobs 2024 Updates : ప్ర‌భుత్వ ఉద్యోగాలు 47 శాతం మహిళలకే.. పురుషుల‌కు మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణ‌ ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో మ‌హిళ‌ల‌కు పురుషుల‌తో దాదాపు స‌మానం ఉద్యోగాలు వ‌స్తున్నాయి. తెలంగాణ నూతన ప్రభుత్వంలో గడచిన మూడు నెలల్లో 28,942 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ప్రభుత్వం అందజేసిన విష‌యం తెల్సిందే.

ఇందులో 47% ఉద్యోగాలు మహిళలకు, 53% ఉద్యోగాలు పురుష అభ్యర్థులు పొందారని ప్రభుత్వం ఒక ప్రకటనలోతెలిపింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ నివేదికను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. స్టాఫ్ నర్స్ పోస్టులలో 88% మహిళలు, పోలీస్ నియామకాలలో 19 శాతం మహిళలు, గురుకుల నియామకాలలో 61 శాతం మహిళలు, టీఎస్పీఎస్సీ నియామకాల లో 41 శాతం మహిళలు ఉద్యోగాలు పొందినట్లు టిఎస్పిఎస్సి నివేదిక వెల్లడి చేసింది.

సుప్రీంకోర్టు, హైకోర్టు సూచనల ప్రకారం..
మహిళా రిజర్వేషన్లు ప్రకారం 33% కంటే ఎక్కువగానే మహిళలకు ఉద్యోగాలు దక్కాయని తెలిపింది. సుప్రీంకోర్టు, హైకోర్టు సూచనల ప్రకారం జీవో నెంబర్-3 ని విడుదల చేశామని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

#Tags