TSPSC Group-1 Exam: జూన్‌-9న గ్రూప్‌-1 పరీక్ష.. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లాలో గ్రూప్‌– 1 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో గురువారం వసతులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జూన్‌ 9న నిర్వహించే గ్రూప్‌ –1 పరీక్షకు జిల్లాలో 13 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయా సెంటర్లలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఫర్నీచర్‌, విద్యుత్‌, తాగునీరు వంటి వసతులు కల్పించాలన్నారు.

Staff Nurse: సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా నియామకాలు.. మూడు నెలలైనా అందని మొదటి జీతం

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తూ, మూడు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు చేపట్టాలన్నారు. ఇటీవల నీట్‌ నిర్వహణలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో రీజినల్‌ కోఆర్డినేటర్‌ నర్సింహం, ప్రిన్సిపాల్‌ రాందాస్‌, సీఐ సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

#Tags