Govt Job Notifications : యువ‌త‌కు గుడ్ న్యూస్‌.. త్వ‌ర‌లోనే జాబ్ నోటిఫికేష‌న్స్.. గ్రూప్స్ ఫ‌లితాల‌పై క్లారిటీ..!!

తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువ‌త‌కు టీజీపీఎస్సీ శుభ‌వార్త తెలిపింది.

సాక్షి ఎడ్యుకేష‌న్: తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువ‌త‌కు టీజీపీఎస్సీ శుభ‌వార్త తెలిపింది. మే 1, 2025న భారీ జాబ్ నోటిఫికేష‌న్‌ల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్. ఈ మెర‌కు మార్చి 31లోగా ఉద్యోగ ఖాళీల వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని తెలిపింది టీజీపీఎస్సీ. గ్రూప్ - 1,2,3 ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన‌ ఫలితాలను కూడా త్వ‌ర‌లోనే విడుదల చేస్తామని చెప్పింది.

TGPSC Group 3 Question Paper and Key PDF: గ్రూప్‌ 3 ప్రిలిమినరీ కీ విడుదల!

ఉద్యోగాల‌ భర్తీపై స్టడీ

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాల ఆధారంగా జాబ్‌ నోటీఫికేషన్స్‌ను జారీ చేస్తామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేషం తెలిపారు. ఈ నేప‌థ్యంలో మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుపుతూ.. మార్చి 31, 2025లోపు పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్స్ ఫలితాలని ప్ర‌క‌టిస్తామ‌ని.. ఏప్రిల్ 2025 తర్వాతే నోటిఫికేషన్స్ జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ లో ఉద్యోగాల‌ భర్తీపై స్టడీ చేసి.. మే 1 నుంచి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు.

TGPSC Group 2 Final Key Release Date: బిగ్‌ బ్రేకింగ్‌.. గ్రూప్-2 పరీక్షల ఫైనల్ 'కీ'

అంతకంటే ముందు ఖాళీల భర్తీపై ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. ఆ తర్వాత వెంటనే పరీక్షలు నిర్వహించి.. ఏ పరీక్ష ఫలితాలు పూర్తయితే వాటిని వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పారు. గతంలో మాదిరిగా ఫలితాలు, భర్తీ విషయంలో ఆలస్యం జరగదన్నారు. నోటిఫికేషన్స్ ఇచ్చిన 6 నుంచి 8 నెలల్లో ఖాళీలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.

వారం రోజుల్లోనే ఫ‌లితాలు కూడా..

ఇటీవల రాష్ట్రంలో ఉన్న వివిధ ప్ర‌భుత్వ‌ శాఖల్లో ఖాళీగా పోస్టుల‌ భర్తీ కోసం నిర్వహించిన గ్రూప్ - 1, 2, 3 పరీక్షల ఫలితాలు కూడా త్వరలోనే విడుద‌ల చేస్తామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేషం అన్నారు. వచ్చే వారం, 10 రోజుల తేడాతో ఫ‌లితాల‌ను విడుదల చేస్తామని వెల్ల‌డించారు. 

TG Court Jobs Applications 2025 : 1673 కోర్టు ఉద్యోగాలు.. ఇలా ఫాలో అయి దరఖాస్తు చేసుకోండి...

ఉద్యోగాల భర్తీపై హైకోర్టు ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ఉన్న‌ ఉద్యోగాల భర్తీపై హైకోర్టు కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని పలు కోర్టుల్లో ఖాళీగా ఉన్న 1,673 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు జనవరి 8, 2025 నుంచే దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. ఇప్ప‌టికే ఎంతో మంది అభ్య‌ర్థులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకుని, ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ పూర్తి చేసుకున్నారు. ప్ర‌స్తుతం, ఇందులో 1277 టెక్నికల్, మరో 184 నాన్ టెక్నికల్ కోటాలో ఉద్యోగాలున్నాయి. తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ కింద మరో 212 పోస్టులు భర్తీ చేయనున్నారు.

 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags