TSPSC Group II: గ్రూప్‌–2 దరఖాస్తు సవరణకు అవకాశం.. సవరణకు చివరి తేదీ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–2 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సవరణ అవకాశం కల్పించింది.
గ్రూప్‌–2 దరఖాస్తు సవరణకు అవకాశం.. సవరణకు చివరి తేదీ ఇదే..

జూలై 8వ తేదీ నుంచి 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులో పొరపాట్లను సవరించుకునే వీలుంటుంది. సవరణ ప్రక్రియ కేవలం ఒక్కసారి మాత్రమే ఉంటుందని, దరఖాస్తును ముందుగా తెరిచి ఎక్కడ పొరపాట్లు ఉన్నాయో గుర్తించి వాటిని సవరించుకోవాలని స్పష్టం చేసింది.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ​​​​​​​ఏపీపీఎస్సీ

ఎడిట్‌ ఆప్షన్‌ కోసం దరఖాస్తును తెరిచి ఎంట్రీ చేసిన వివరాలను తుది వివరాలుగా పరిగణిస్తామని కమిషన్‌ స్పష్టం చేసింది. పేరు, ఆధార్‌ వివరాలు, పుట్టిన తేదీ తదితరాలను సవరించుకోవాల్సి వస్తే అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. సవరణ తర్వాత పీడీఎఫ్‌ దరఖాస్తును భవిష్యత్‌ అవసరాల కోసం డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కమిషన్‌ కార్యదర్శి జూలై 6న ఒక ప్రకటనలో తెలిపారు.

#Tags