Groupp 1 Mains Selection Listలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్ర అన్యాయం

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 మెయిన్స్‌కు అర్హుల జాబితా రూపకల్పనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు తీవ్ర నష్టం జరిగిందని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష ఆధారంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపికలో జీఓ 29 ప్రకారం చేయడంతో ఈ నష్టం జరిగినట్టు వివరించారు. జీఓ 29 ప్రకారం మల్టీజోన్‌ పరిధిలోని పోస్టుల ఆధారంగా ఆ సంఖ్యకు 50 రెట్లు అదనంగా అభ్యర్థులను ఎంపిక చేశారని తెలిపారు. ఈ ప్రక్రియలో ఓపెన్‌ కాంపిటేషన్‌ కేటగిరీలోకి రిజర్వేషన్‌ ఉన్న అభర్థులు అర్హత సాధించలేకపోయారన్నారు.

చదవండి: TGPSC Groups - 2024 Study Material, Bitbank, Model & Previous Papers ...

ఈ అంశంపై టీజీపీఎస్సీని సంప్రదిస్తే సుప్రీంకోర్టు తీర్పును చూపిస్తున్నారని, కానీ సుప్రీంకోర్టు తీర్పుకు ప్రస్తుత పరిస్థితికి ఏమాత్రం పొంతన లేనప్పటికీ సంబంధం లేని అంశాలతో అభ్యర్థులను గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఈ మేరకు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాశారు. ఈ ప్రతులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీజీపీఎస్సీ కమిషన్‌ చైర్మన్‌కు సైతం పంపారు.

#Tags