Free Coaching for TSPSC Group Exams: గ్రూప్ 2, 3, 4 పరీక్షలకు ఉచిత శిక్షణ
భూపాలపల్లి అర్బన్: ఎస్సీ, స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్ 2, 3, 4 పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు, అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారిని సునీత మార్చి 26న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లాలో డిగ్రీ పాసైన ఎస్సీ నిరుద్యోగ యువతి, యువకులు ఈ నెల 30వ తేదీలోపు కలెక్టరేట్‌లోని కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. మూడు నెలల పాటు ఉచిత భోజన వసతితో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంతకు ముందు ఏదైనా ప్రభుత్వ సంక్షేమశాఖ ద్వారా శిక్షణ పొందిన వారు అనర్హులని సూచించారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
#Tags