TGPSC: సీడీపీఓ పరీక్ష రద్దు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి(సీడీపీఓ), గ్రేడ్‌–1 ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌(సూపర్‌వైజర్‌) ఉద్యోగాల భర్తీకి సంబంధించి గతేడాది జనవరి 3న నిర్వహించిన అర్హత పరీక్షను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) రద్దు చేసింది.

ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్‌ నికోలస్‌ జూలై 19న‌ ఓ ప్రకటన విడుదల చేశారు. టీజీపీఎస్సీలో వివిధ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబోరేటరీ(సీఎఫ్‌ఎస్‌ఎల్‌), స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌(ఎస్‌ఐటీ) ఇచ్చిన నివేదికలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్‌ తెలిపింది.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఈ పరీక్షను తిరిగి నిర్వహించే సమాచారాన్ని, పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు కమిషన్‌ వెల్లడించింది. కాగా ఈ పరీక్షకు సంబంధించి ప్రాథమిక ఎంపిక జాబితాను విడుదల చేసి అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించడంతో పాటు ఈ ఏడాది ఫిబ్రవరి 3న తుది ఫలితాలను సైతం ప్రకటించిన విషయం తెలిసిందే. 

#Tags