AE Recruitment 2022: గుడ్‌న్యూస్‌.. ఏఈ పోస్టుల‌కు నోటిఫికేషన్ విడుద‌ల‌.. నేటి నుంచే ద‌ర‌ఖాస్తులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. విద్యుత్‌ శాఖ (TSSPDCL)లో పోస్టుల భర్తీకి మే 11వ తేదీన (బుధవారం) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
TSSPDCL AE Jobs

విద్యుత్ శాఖలో 70 ఏఈ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల ఆహ్వానం కోరింది. మే 12వ తేదీ నుంచి జూన్‌ 3వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది.  రాత పరీక్ష జూలై 17వ తేదీన జరుగనుంది. పూర్తి వివ‌రాల‌ను వెబ్‌సైట్‌ https://tssouthernpower.cgg.gov.in లేదా www.tssouthernpower.comలో పొందుపరచనున్నట్టు యాజమాన్యం తెలిపింది.

మొత్తం 1,271 పోస్టులలో..
దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) 1,271 పోస్టుల భర్తీకి మే 9న నోటిఫికేషన్ ప్రకటించిన విష‌యం తెల్సిందే. ఇందులో 70 అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రిక‌ల్‌) నోటిఫికేష‌న్‌ను మే 11వ తేదీన విడుద‌ల చేసింది.  ఇంకా 201 సబ్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రిక‌ల్‌), 1000 జూనియర్‌ లైన్ మెన్ (జేఎల్‌ఎం) పోస్టులు ఉన్నాయి. త్వరలోనే ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎన్పీడీసీఎల్‌), తెలంగాణ జెన్ కో సంస్థల నుంచి సైతం ఇతర కేటగిరీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న విద్యుత్‌ ప్లాంట్ల నిర్వహణకు తెలంగాణ జెన్ కో దాదాపు 200 ఏఈ పోస్టులను భర్తీ చేసే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. ఓ మూడు, నాలుగు నెలల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందన్నారు.

TSSPDCL Notification 2022 For 1271 Vacancies - Click Here

#Tags