Naveen Kumar Sucess Story: 27 సార్లు ప్రయత్నించి విఫలప్రయత్నం..! చివరకు ఎస్సైగా ఎంపికై..

నవీన్‌ కుమార్‌ మానుపూరి.. సూర్యాపేట జిల్లా తాళ్లసింగారం గ్రామం. తల్లిదండ్రులు సంగయ్య, ఉపేంద్ర.

తండ్రి చేనేత కార్మికుడు. ముగ్గురు కుమారుల్లో రెండో వ్యక్తి నవీన్‌ . చిన్నప్పటి నుంచి యూనిఫాం వేసుకొని ఆఫీసర్‌ హోదాలో గౌరవం పొదాలనేది అతడి కోరిక. ఆర్మీలో చేరేందుకు పట్టుదలతో ఎంతో కృషి చేశాడు.

చదవండి: Women SI Success Story : గృహిణిగా.. ఇద్దరు పిల్లల తల్లిగా ఉంటూ.. ఎస్ఐ ఉద్యోగం కొట్టానిలా.. కానీ..

కమాండెంట్‌ అధికారి హోదా కోసం 27 సార్లు విఫలప్రయత్నం చేశాడు. ప్రతిసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లి రిజెక్ట్‌ అవుతుండేవాడు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు. చివరకు ఎస్సైగా ఎంపికై.. సెప్టెంబ‌ర్ 11న‌ జరిగిన ΄ాసింగ్‌ పరేడ్‌లో ΄పాల్గొన్నాడు.

పీవోపీ సమయంలో తల్లిదండ్రుల కళ్లల్లో కన్నీళ్లు చూసినప్పుడు నా ఆనందం మాటల్లో చెప్పలేనిదంటూ సంతోషం వ్యక్తం చేశాడు.  

#Tags