SI Bhagyashree Sucess Story: ఒడిలో పాపాయికి పాలు మాన్పించి.. పోలీసు శిక్షణలో టాపర్‌గా నిలిచిన‌ శివంగి

ఒడిలో పాపాయికి చనుబాలు మాన్పించి.. 32ఏళ్ల వయసులో గ్రౌండ్‌ బాటపట్టారు. అనుక్షణం తనను తాను నిరూపించుకోవాలని వందకు రెండొందల రెట్లు కష్టపడ్డారు. మైదానంలో శివంగిలా దూకారు.

మెదడుకు పదును పెట్టారు. పోలీసు శిక్షణలో భాగంగా ఇండోర్, ఔట్‌డోర్‌ విభాగాల్లో ఔరా అనిపించి టాపర్‌గా నిలిచి పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ కమాండెంట్‌గా నిలిచారు భాగ్యశ్రీ. భద్రాచలంలోని సారపాక గ్రామానికి చెందిన భాగ్యశ్రీ చాలా పేదరికం నుంచి వచ్చారు. తండ్రి నాగేశ్వరరావు ఇప్పటికీ పెళ్లిళ్లకు వంటలు చేస్తుంటారు.

చదవండి: Aashna Chaudhary IPS Officer Real Life Story : తిరస్కరించారు... పోరాటం చేసి ఐపీఎస్ ఆఫీస‌ర్ అయ్యారిలా.. కానీ ఈమె మాత్రం..

తల్లి దుర్గ. భర్త పవన్‌  కుమార్‌ ప్రైవేటు ఉద్యోగి. చదువు మాత్రమే పేదరికాన్ని దూరం చేస్తుందని నమ్మి చదువుపై శ్రద్ధ పెట్టారు. గతంలో గ్రూప్‌–4 ఉద్యోగం చేస్తూ సమాజానికి నేరుగా ఏదైనా సాయం చేయాలన్న తలంపుతో ఎస్సై కోసం సన్నద్ధమయ్యారు.

ఆ సమయంలో ఎన్నో కష్టాలకు ఎదురొడ్డారు. భర్త ప్రోద్బలంతో ఇదంతా సాధ్యమైందని చెబుతున్నారు. శిక్షణలో ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నానని, ఫీల్డ్‌లో ఎంతో కష్టపడతానని పేర్కొన్నారు.  
 

#Tags