TS SI Posts Selected Candidates Success Stories : ఇందుకే.. ఎస్ఐ ఉద్యోగం కొట్టామిలా.. మా ల‌క్ష్యం ఇదే..

తెలంగాణ‌లో ఎస్సై, ఏఎస్సై పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి ఆగస్టు 6వ తేదీన విడుదల చేసిన విష‌యం తెల్సిందే.
Telangana SI Jobs Selected Candidates Success Stories

ఈ ఫ‌లితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అభ్య‌ర్థులు స‌త్తాచాటారు. దుండ్రపల్లికి చెందిన గుంటి అరుణ్‌ కుమార్‌కు చిన్ననాటి నుంచి పోలీస్‌ యూనిఫాం వేసుకోవాలనేది అత‌ని కల. వీరిది వ్యవసాయ కుటుంబం. అమ్మనాన్నలు అంజవ్వ–ఎల్లయ్య.

☛ SI Success Story : ఓ రైతుబిడ్డ.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దివి.. ఎస్‌ఐ ఉద్యోగం కొట్టాడిలా.. కానీ..

గుంటి అరుణ్‌ కుమార్‌..బీటెక్‌ కొండగట్టు జేఎన్‌టీయూలో, ఎంటెక్‌ ఉస్మానియాలో పూర్తి చేశాడు. మిత్రులందరూ సాఫ్ట్‌వేర్‌ వైపు వెళ్తే.. అరుణ్‌ మాత్రం పట్టు వదలకుండా కరీంనగర్‌లో కోచింగ్‌ తీసుకున్నాడు. రెగ్యులర్‌గా ఈవెంట్స్‌, థియరీ ప్రిపేర్‌అవుతూ సివిల్‌ ఎస్సైగా ఉద్యోగం సాధించాడు.

అప్పటి నుంచే పోలీస్‌ కావాలనే లక్ష్యంతో..
జగిత్యాల జిల్లా తాటిపల్లికి చెందిన బాదినేని రాజేశ్వర్‌ది వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్న గంగు, గంగారెడ్డి. 2014లో డిగ్రీ పూర్తిచేశాడు. అప్పటి నుంచి పోలీస్‌ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 2016లో టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చినా వెళ్లలేదు. 2018లో అర్చనతో వివాహమైంది. నాలుగేళ్ల కూతురు అన్షిత ఉంది. అయినా ప్రిపరేషన్‌ ఆపకుండా ఎస్సై కొలువే లక్ష్యంగా ముందుకు సాగాడు. కరీంనగర్‌లో ఉంటూ.. ఓ ప్రయివేటు సంస్థలో శిక్షణ పొందాడు. ఆదివారం నాటి ఫలితాల్లో ఓపెన్‌ కేటగిరీలో విజయం సాధించాడు. రాజన్న సిరిసిల్ల జోన్‌లో సివిల్‌ ఎస్సైగా ఎంపికయ్యాడు. ఇన్నేళ్ల తన కల నెరవేరినందుకు సంతోషంగా ఉందని జగదీశ్వర్‌ వివరించాడు.

☛ Women SI Success Story : ఓ పేదింటి బిడ్డ 'ఎస్ఐ' ఉద్యోగం కొట్టిందిలా.. ఈమె విజ‌యం కోసం..

ఈ ముగ్గురు పేదింటి బిడ్డ‌లు..
చొప్పదండి మండలానికి చెందిన ముగ్గురు పేదింటి యువత ఎస్‌ఐలుగా ఎంపికయ్యారు. గుమ్లాపూర్‌కు చెందిన రైతు అంజయ్య, కవితల ఏకైక కుమారుడు పొరండ్ల అనిల్‌కుమార్‌ ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. రుక్మాపూర్‌కు చెందిన కూలీ కుటుంబం నుంచి కుంచం మానస ఎస్‌ఐగా ఎంపికైంది. గుమ్లాపూర్‌కు చెందిన బత్తుల నారాయణ కుమారుడు బత్తుల అభిలాష్‌ ఆర్‌ఎస్‌ఐగా ఎంపికయ్యాడు.

☛ TS SI Jobs Selected Candidates Success Stories : నిరుపేద కుటుంబం నుంచి వ‌చ్చారు.. ఇలా చ‌దివారు.. అలా ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా..

#Tags