Constable Jobs: గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు

కానిస్టేబుల్‌ పోస్టుల నియామకాలకు కోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో ఏఆర్‌, సివిల్‌ కానిస్టేబుల్‌ 700 పోస్టులు ఉన్నాయి. వీటితో ఎక్సైజ్‌, ఆర్టీవో, ఫైర్‌ పోస్టులతో పాటు టీఎస్పీఎస్‌ పోస్టులకు ఉమ్మడి జిల్లా అభ్యర్థులు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నాలుగు ప్రశ్నలు మినహాయించి అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు ఇవ్వాలని అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో సింగిల్‌ బెంచ్‌ కోర్టు 4 మార్కులు కలిపి మళ్లీ రిజల్ట్‌ ఇవ్వాలని తీర్పునిచ్చింది. దీంతో కొంతమంది అభ్యర్థులు ద్విసభ్య ధర్మాసనానికి ఫిర్యాదు చేశారు.

కోర్టు జ‌న‌వ‌రి 4వ తేదీన‌ తీర్పు వెలువరించింది. ఇందులో నాలుగు వారాల్లో నాలుగు మార్కులకు సంబంధించిన నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లో నియామాకాలు పూర్తి చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. గతేడాది అక్టోబర్‌ 4న తుది ఫలితాలను వెలువరించిన తర్వాత ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేశారు.

అనంతరం ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించారు. తర్వాత ఎంపికైన అభ్యర్థుల గురించి ఎస్బీ ఎంకై యిర్వీ పూర్తి చేశారు. మెడికల్‌ టెస్ట్‌లు నిర్వహించిన అనంతరం ట్రైనింగ్‌కు వెళ్లే అవకాశాలున్నాయి. కోర్టు తీర్పుపై అభ్యర్థులు అనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటన కోసం అభ్యర్థులు వేచి చూస్తున్నారు.

High Court: కానిస్టేబుల్‌ నియామకాలకు లైన్‌క్లియర్‌

#Tags