TSLPRB: ‘పోలీస్‌’ నోటిఫికేషన్ కు బారీగా దరఖాస్తులు

తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ రిక్రూ ట్‌మెంట్‌ బోర్డు జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ కు అభ్యర్థుల నుంచి భారీ స్పందన లభిస్తోంది.
‘పోలీస్‌’ నోటిఫికేషన్ కు బారీగా దరఖాస్తులు

పోలీస్, ఫైర్, ఎస్‌పీఎఫ్, ట్రా¯Œ్సపోర్టు, ఆబ్కారీ, జైళ్ల శాఖలోని 17 వేలకుపైగా పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించగా మే 16 సాయంత్రం వరకు 6.5 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు బోర్డు అధికార వర్గాలు వెల్లడించాయి. 2018లో సుమారు 12 వేల పోలీసు ఉద్యో గాలకు 6 లక్షల దరఖాస్తులు రాగా ఈసారి గడువుకు మరో 4 రోజుల సమయం ఉండగానే అంతకన్నా ఎక్కువ దరఖాస్తులు రావడం గమనార్హం. మే 2న మొదలైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు తొలిరోజే 15 వేలకుపైగా దరఖాస్తులు రాగా మొదటి వారంలో దాదాపు 2.5 లక్షల దరఖాస్తులు అందినట్లు బోర్డు ప్రకటించింది. అలాగే మే 12 వరకు దరఖాస్తుల సంఖ్య 4.5 లక్షలు దాటినట్లు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస్‌రావు తెలిపారు. 2.5 లక్షల మంది అభ్యర్థులు వివిధ పోస్టులకు 4.5 లక్షల దరఖాస్తులు దాఖలు చేసినట్టు పేర్కొన్నారు. గత నాలుగు రోజుల్లో ఏకంగా 2 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. మే 20న గడువు ముగిసే సమయానికి మరో లక్ష దరఖాస్తులు అందుతాయని భావిస్తున్నారు. మే 12 వరకు వచ్చిన దరఖాస్తుల్లో మహిళా అభ్యర్థులు లక్ష దరఖాస్తులు సమర్పించగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గత నోటిఫికేషన్లతో పోలిస్తే మహిళా అభ్యర్థులు దాఖలు చేస్తున్న దరఖాస్తులు 20 శాతానికిపైగా పెరిగే అవకాశం ఉంది.

చదవండి:

TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!

TS Police Exams Best Preparation Tips: పక్కా వ్యూహంతో.. ఇలా చ‌దివితే పోలీస్ ఉద్యోగం మీదే..!

​​​​​​​TS Police Jobs: 16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తుకు వయోపరిమితి ఇదే..

#Tags