వైరస్ రేణువులను ఏమని పిలుస్తారు?
1. పొగాకు మొజాయిక్ వైరస్ (టి.ఎం.వి.)ను స్ఫటికీకరించినందుకుగాను నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త ఎవరు?
1) ప్రేంకల్ కన్రాట్
2) బాడెన్
3) డబ్లు్య.ఎం. స్టాన్లీ
4) ఆండ్రీ లోప్
- View Answer
- సమాధానం: 3
2. వైరస్ రేణువులను ఏమని పిలుస్తారు?
1) వైరాయిడ్
2) ప్రియాన్లు
3) పెప్లోస్
4) విరియాన్లు
- View Answer
- సమాధానం: 4
3.కింది వాటిలో ప్రియాన్లు ఏ వ్యాధులను కలుగజేస్తాయి?
1) టొమాటో మచ్చల తెగులు, వరి గిడసబారే తెగులు
2) సిట్రిస్ వీన్ బాండింగ్, కోకో ఉబ్బుకాండం తెగులు
3) గొర్రెల్లో స్క్రాప్రి వ్యాధి, ఆవుల్లో మ్యాడ్ కౌ వ్యాధి
4) పొటాటో స్పిండిల్ ట్యూబర్, సిట్రస్ ఎక్సోకార్టోసిస్ వ్యాధి
- View Answer
- సమాధానం: 3
4. కింది వాటిలో సరికాని జత ఏది?
1) న్యుమోనియా – డిప్లోకోకస్
2) కుష్టు – మైకోబ్యాక్టీరియం
3) క్షయ – మైకోబ్యాక్టీరియం
4) ప్లేగు – కొరినే బ్యాక్టీరియం
- View Answer
- సమాధానం: 4
5. కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1) డిసెంట్రీ (అమీబియాసిస్)ని కలుగజేసే క్రిమి ప్రొటోజోవా వర్గానికి చెందింది
2) ఆంథ్రాక్స్ను కలుగజేసే క్రిమి బ్యాక్టీరియా
3) ఎలిఫెంటియాసిస్ (బోదకాలు)ను కలుగజేసే క్రిమి హెల్మింథిస్కు చెందుతుంది
4) మలేరియా వ్యాధిని కలుగజేసే ప్లాస్మోడియం క్రిమి ఒక బ్యాక్టీరియా
- View Answer
- సమాధానం: 4
6. కింది వాటిలో గంగా నదిలో నీటిని పరిశుద్ధం చేసే బ్యాక్టీరియా ఏది?
1) ఎశ్చరీషియా కోలై
2) డెల్లో విబ్రియో
3) సూడోమోనాస్
4) రైజోబియం
- View Answer
- సమాధానం: 2
7. సముద్ర కాలుష్యం (చమురు తెట్టు)ను తొలగించే ‘సూపర్ బగ్’ పేరేమిటి?
1) సూడోమోనాస్ పుటిడా
2) బాసిల్లస్ థురెంజియెన్సిస్
3) పాశ్చురెల్లా పెస్టిస్
4) సూడోమోనాస్ సోలనేసియారం
- View Answer
- సమాధానం: 1
8. కణజాల వర్ధనంలో ఏర్పడే అవయవ విభేదనం చెందని కణాల సమూహాన్ని ఏమని పిలుస్తారు?
1) కాలోస్
2) కాలస్
3) ఎక్స్‌ప్లాంట్
4) క్లోన్
- View Answer
- సమాధానం: 2
9. వైరస్ రహిత మొక్కలను ఏవిధంగా ఉత్పత్తి చేస్తారు?
1) వేరు అగ్రాల వర్ధనం ద్వారా
2) పత్ర వర్ధనం ద్వారా
3) కాండాగ్రాల వర్ధనం ద్వారా
4) పరాగకోశ వర్ధనం ద్వారా
- View Answer
- సమాధానం: 3
10. వాయు సహిత శ్వాసక్రియలో ఒక గ్లూకోజ్ అణువు ఆక్సీకరణం చెందినప్పుడు విడుదలయ్యే ఉష్ణశక్తి ఎంత?
1) 56 కిలో కేలరీలు
2) 686 కిలో కేలరీలు
3) 412 కిలో కేలరీలు
4) 274 కిలో కేలరీలు
- View Answer
- సమాధానం: 2
11. శ్వాసక్రియ అనేది ఒక?
1) శక్తిమోచక, క్షయకరణ, విచ్ఛిన్నకర ప్రక్రియ
2) శక్తిగ్రాహక, ఆక్సీకరణ, నిర్మాణాత్మక ప్రక్రియ
3) శక్తిమోచక, ఆక్సీకరణ, విచ్ఛిన్నకర ప్రక్రియ
4) శక్తిమోచక, క్షయకరణ, నిర్మాణాత్మక ప్రక్రియ
- View Answer
- సమాధానం: 3
12. కిణ్వన ప్రక్రియను కనుగొన్న శాస్త్రవేత్త?
1) గెలుసాక్
2) లూయిపాశ్చర్
3) ఎడ్వర్డ్ బుక్నర్
4) హన్స్క్రెబ్స్
- View Answer
- సమాధానం: 1
13. అవాయు శ్వాసక్రియలో చక్కెరలు పాక్షికంగా విచ్ఛిన్నమవ్వడం వల్ల ఏర్పడేవి?
1) ఫ్రక్టోజ్, నీరు
2) గ్లూకోజ్, కార్బన్ డైఆక్సైడ్
3) ఆల్కహాల్, కార్బన్ డైఆక్సైడ్
4) నీరు, కార్బన్ డైఆక్సైడ్
- View Answer
- సమాధానం: 3
14. మొక్కల్లో చక్కెర పదార్థాల రవాణాను వివరించే సమూహ ప్రవాహవాదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
1) డీవ్రీస్
2) మ్యున్చ్
3) సాక్స్
4) జె.సి.బోస్
- View Answer
- సమాధానం: 2
15. కిరణజన్య సంయోగక్రియ ఒక?
1) ఆక్సీకరణ, శక్తిమోచక, విచ్ఛిన్న క్రియ
2) క్షయకరణ, నిర్మాణాత్మక, శక్తిమోచక క్రియ
3) క్షయకరణ, శక్తిగ్రాహక, విచ్ఛిన్న క్రియ
4) క్షయకరణ, శక్తిగ్రాహక, నిర్మాణాత్మక క్రియ
- View Answer
- సమాధానం: 4
16. కింది వాటిలో హరితరేణువులో ఉండని వర్ణద్రవ్యం ఏది?
1) పత్రహరితం
2) కెరోటి
3) ఆంథోసయనిన్
4) జాంతోఫిల్
- View Answer
- సమాధానం: 3
17. కిరణజన్య సంయోగక్రియ ప్రత్యేకత ఏమిటి?
1) కార్బోహైడ్రేట్ల ఉత్పత్తి
2) ఆక్సిజన్ విడుదల
3) కాంతిశక్తిని రసాయనశక్తిగా మారుస్తుంది
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
18. ఎంజైమ్‌లు మౌలికంగా?
1) విటమిన్లు
2) ప్రోటీన్లు
3) కొవ్వులు
4) చక్కెరలు
- View Answer
- సమాధానం: 2
19. ఎంజైమ్‌లు, విటమిన్లు, హార్మోన్లలో ఉండే సాధారణ లక్షణమేంటి?
1) ఇవన్నీ ప్రోటీన్లు
2) అన్ని జీవుల్లో సంశ్లేషితమవుతాయి
3) ఆక్సీకరణ, జీవక్రియలను పెంచుతాయి
4) జీవక్రియలను నియంత్రించడంలో సహాయపడతాయి
- View Answer
- సమాధానం: 4
20. జతపరచండి.
మొక్క | తినే భాగం |
a) క్యారెట్, ముల్లంగి | i) కాండం |
b) అల్లం, పసుపు | ii) పత్రం, పొలుసాకులు |
c) ఉల్లి, వెల్లుల్లి | iii) వేర్లు |
d) లవంగాలు | iv) విప్పారని పూమొగ్గలు |
2) a - iii, b - i, c - iv, d - ii
3) a - ii, b - i, c - iii, d - iv
4) a - iii, b - i, c - ii, d - iv
- View Answer
- సమాధానం: 4
21. జతపరచండి.
పరాగసంపర్క రకం | సహాయకారులు |
a) ఎనిమోఫిలి | i) గాలి |
b) ఎంటమోఫిలి | ii) కీటకాలు |
c) ఆర్నిథోఫిలి | iii) పక్షులు |
d) కాంథరోఫిలి | iv) సీతాకోక చిలుకలు |
v) తేనెటీగలు |
2) a - i, b - ii, c - v, d - iv
3) a - i, b - ii, c - iii, d - iv
4) a - ii, b - i, c - iv, d - v
- View Answer
- సమాధానం: 3
22. కింది వాటిలో సరికాని జత ఏది?
ఎ) ఆస్టియాలజీ – ఎముకల అధ్యయనం
బి) హెమటాలజీ – రక్తం గురించి చేసే అధ్యయనం
సి) ప్రినాలజీ – నేరస్థుల గురించి చేసే అధ్యయనం
డి) పేలియంటాలజీ – శిలాజాల గురించి అధ్యయనం
1) ఎ, బి మాత్రమే
2) ఎ, సి మాత్రమే
3) సి మాత్రమే
4) ఎ, డి మాత్రమే
- View Answer
- సమాధానం: 3
23. జతపరచండి.
ఎముక పేరు | ఉండే భాగం |
a) హ్యూమరస్ | i) భుజాస్థి |
b) రేడియస్ అల్నా | ii) ముంజేయి |
c) పీమర్ | iii) తొడ ఎముక |
d) పాలింజెన్స్ | iv) మోకాలు |
v) కాలి వేళ్లు, చేతి వేళ్లు |
2) a - i, b - ii, c - iii, d - v
3) a - i, b - v, c - iv, d - iii
4) a - v, b - iii, c - ii, d - i
- View Answer
- సమాధానం: 2
24. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ఆంజియాలజీ – రక్తనాళాల గురించి చేసే అధ్యయనం
బి) మహాధమని అతిపెద్ద ధమని. ఇది కుడి జఠరిక నుంచి బయలుదేరి ఆక్సిజన్ సహిత రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తుంది
సి) కరోనరీ ఆర్టరీలో ఏర్పడే అడ్డంకుల వల్ల గుండెపోటు (హార్ట్ ఎటాక్) వస్తుంది
1) ఎ మాత్రమే
2) ఎ, సి మాత్రమే
3) ఎ, బి మాత్రమే
4) బి మాత్రమే
- View Answer
- సమాధానం: 2
25. కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ) పీయూషగ్రంథి అతి ప్రధాన గ్రంథి. కానీ ఇది అంతఃస్రావ గ్రంథులన్నింటిలోకెల్లా అతి చిన్నది
బి) థైరాయిడ్ గ్రంథిని ‘ఆడమ్స్ యాపిల్’ అని అంటారు. దీని లోపం వల్ల చిన్నపిల్లల్లో ‘క్రిటినిజం’, పెద్దవారిలో ‘మిక్సోఎడిమా’ వ్యాధి వస్తుంది
సి) క్లోమగ్రంథిని మిశ్రమ గ్రంథి అంటారు. క్లోమగ్రంథి చెందిన ఆల్ఫా, బీటా కణాలు ఇన్సులిన్ హార్మోన్‌ను స్రవిస్తాయి
1) ఎ, బి, సి
2) ఎ, సి మాత్రమే
3) ఎ, బి మాత్రమే
4) బి, సి మాత్రమే
- View Answer
- సమాధానం: 3
26. సుఖప్రసవానికి, పొదుగు నుంచి పాల విడుదలకు తోడ్పడే హార్మోన్ ఏది?
1) ఈస్ట్రోజోన్
2) ప్రొజెస్టీరాన్
3) ఆక్సిటోసిన్
4) టెస్టోస్టి్టరాన్
- View Answer
- సమాధానం: 3
27. అసంకల్పిత ప్రతీకార చర్యలు దేని ఆధీనంలో ఉంటాయి?
1) మస్తిష్కం
2) అనుమస్తిష్కం
3) మజ్జాముఖం
4) వెన్నుపాము
- View Answer
- సమాధానం: 4
28. ముష్కాలు శరీరం లోపల కాకుండా దేహం బయట ముష్కగోణిలో వేలాడుతూ ఉంటాయి. కారణమేంటి?
1) శుక్రకణోత్పత్తికి కావలసిన తక్కువ ఉష్ణోగ్రత ఉండటానికి వీలుగా బయట ఉంటాయి
2) శరీర నిర్మాణంలో భాగంగా బయట ఉంటాయి
3) సంపర్కం కోసం బయట ఉంటాయి
4) పైవేవీకావు
- View Answer
- సమాధానం: 1
29. మాస్టెక్టమీ ఆపరేషన్ అంటే ఏమిటి?
1) గర్భాశయాన్ని తొలగించడం
2) రొమ్ములను తొలగించడం
3) వేసెక్టమీ
4) ట్యూబెక్టమీ
- View Answer
- సమాధానం: 2
30. ప్రౌఢ మానవుడిలో ఉండే కుంతకాలు, రదనికల మొత్తం సంఖ్యలు వరసగా?
1) 2, 1
2) 4, 2
3) 8, 2
4) 8, 4
- View Answer
- సమాధానం: 4
31.కాలేయం విధి?
1) పైత్యరసం ఉత్పత్తి
2) యూరియా ఉత్పత్తి
3) హెపారిన్ ఉత్పత్తి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
32. పాలు తాగే చిన్నపిల్లల్లో మాత్రమే ఉండే ఎంజైమ్ ఏది?
1) ఎమైలేజ్
2) లైపేజ్
3) రెనిన్
4) ప్రొటియేజ్
- View Answer
- సమాధానం: 3
33. రక్తస్కందనకు తోడ్పడే మొత్తం కారకాల సంఖ్య ఎంత?
1) 13
2) 4
3) 9
4) 10
- View Answer
- సమాధానం: 1
34. ఎర్ర రక్తకణాలు, కొన్ని ప్రోటీన్లు లేని రక్తాన్ని ఏమంటారు?
1) శోషరసం
2) ప్లాస్మా
3) జీవ పదార్థం
4) తెల్ల రక్తకణాలు
- View Answer
- సమాధానం: 1
35.మిట్రల్ కవాటం గుండెలోని ఏయే గదుల మధ్య ఉంటుంది?
1) కుడి కర్ణిక – కుడి జఠరిక
2) ఎడమ కర్ణిక – ఎడమ జఠరిక
3) కుడి కర్ణిక – ఎడమ జఠరిక
4) ఎడమ కర్ణిక – కుడి జఠరిక
- View Answer
- సమాధానం: 2
36. శ్వాసవృక్షం నిర్మాణంలో పాల్గొనే భాగాలు?
1) శ్వాస నాళం
2) శ్వాస నాళికలు
3) వాయుకోశ గోణులు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
37. విశ్వగ్రహీత, విశ్వదాత రక్తవర్గాలు వరసగా?
1) O, AB
2) AB, O
3) O, A
4) A, AB
- View Answer
- సమాధానం: 2
38. రక్తంలో సీరమ్ క్రియాటిన్ బాగా పెరిగితే?
1) కాలేయం వాస్తుంది
2) గుండెపోటు వస్తుంది
3) దంతాలు పుచ్చిపోతాయి
4) కిడ్నీలు చెడిపోతాయి
- View Answer
- సమాధానం: 4
39. సుప్తావస్థ (డార్మెన్సీ)ని కలిగించే హార్మోన్ ఏది?
1) ఆబ్సైసిక్ ఆమ్లం
2) ఆక్సిన్లు
3) సైటోకైనిన్లు
4) జిబ్బరెల్లిన్లు
- View Answer
- సమాధానం: 1
40. వార్ధక్యం (ముసలితనం) పోగొట్టే హార్మోన్ ఏది?
1) అబ్‌సైసిక్ ఆమ్లం
2) ఇథిలీన్
3) జిబ్బరెల్లిన్లు
4) సైటోకైనిన్లు
- View Answer
- సమాధానం: 4
41. బ్లడ్ కేన్సర్ నివారణలో ఉపయోగించే విటమిన్ ఏది?
1) విటమిన్ – Q
2) విటమిన్ – D
3) విటమిన్ – B17
4) విటమిన్ – B2
- View Answer
- సమాధానం: 3
42. పొగాకులో లభించే విటమిన్ ఏది?
1) B1
2) B3
3) B2
4) B6
- View Answer
- సమాధానం: 2
43.భూమి మీద విజయవంతంగా వర్ధిల్లుతున్న జీవరాశుల అతి పెద్ద వర్గం ఏది?
1) అనెలిడా
2) ఇకైనోడెర్మేటా
3) సరీసృపాలు
4) ఆర్థ్రోపొడా
- View Answer
- సమాధానం: 4
44. ముత్యాలను ఏర్పరిచే ‘పింక్టాడ వల్గారిస్’ ఏ వర్గానికి చెందింది?
1) అనెలిడా
2) ఆర్థ్రోపొడా
3) మొలస్కా
4) ఇకైనోడెర్మేటా
- View Answer
- సమాధానం: 3
45. ఎబోలా వైరస్‌కు రిజర్వాయర్ అథిదేహిగా ఉండే గబ్బిలం ఏ వర్గానికి చెందింది?
1) పక్షులు
2) క్షీరదాలు
3) సరీసృపాలు
4) కీటకాలు
- View Answer
- సమాధానం: 2