2022 Constables: 2022 కానిస్టేబుల్‌ అభ్యర్థులను శిక్షణకు పంపించాలి: ఆర్‌.కృష్ణయ్య

పంజగుట్ట (హైదరాబాద్‌): కానిస్టేబుల్‌–2022 పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులను చిన్నచిన్న కారణాలు చూపి శిక్షణకు పంపకపోవడం అన్యాయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు.

ఆ అభ్యర్థులపై వివిధ కారణలతో అకారణంగా పెట్టిన కేసులు, స్కూల్‌ బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ లేదన్న కారణాలతో సెలక్షన్‌ ఆర్డర్‌ అందుకున్నప్పటికీ శిక్షణకు మాత్రం పంపించలేదని, ఇలాంటి చిన్నచిన్న కేసులు ఎత్తివేసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వీరిని కూడా శిక్షణకు పంపించాలని ఆయన కోరారు.

చదవండి: Family Success Story : ఈ పేదింటి బిడ్ద‌లు.. చ‌దువును ఆయుధంగా చేసుకున్నారు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టారిలా.. కానీ..

మే 29న‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 2022 కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభ్యర్థులను వెంటనే శిక్షణకు పంపకపోతే ప్రజాసంఘాలు, బీసీ, దళిత సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని, తదుపరి జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కృష్ణయ్య హెచ్చరించారు.  

#Tags