TS Inter Supplementary Exam Dates Out: ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. సప్లిమెంటరీ తేదీలు విడుదల

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి ఫస్ట్ ఈయర్, సెకండ్ ఈయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఈసారి ఫలితాల్లో ఫస్ట్‌ ఇయర్‌లో 60.11శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, సెకండ్ ఇయర్‌లో 64.19శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

మొత్తం 9,80,978 మంది ఎగ్జామ్స్ రాస్తే అందులో ఫస్ట్ ఈయర్ నుంచి 2.87 లక్షల మంది, సెకండ్‌ ఇయర్‌లో  3.22 లక్షల మంది విద్యార్థులు పాసయ్యారు. ఈ నేపథ్యంలో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు మరో ఛాన్స్‌ కల్పిస్తూ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది.

రేపటి నుంచి మే 2 వరకు రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వెంకటేశం తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు. 
 

#Tags