Telangana Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై బిగ్ అప్‌డేట్, ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్ కోసం..
తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఇటీవలె ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో తెలంగాణలో ఇంటర్ ఫలితాల కోసం అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది.
మార్కుల జాబితా సక్రమంగా ఉందా? సాంకేతికపరమైన సమస్యలున్నాయా? అనే అంశాలను ఒకటికి రెండు సార్లు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో పాటు వ్యాల్యూయేషన్‌లో వచ్చిన మార్కులను కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకున్న తర్వాత ఫలితాలను వెల్లడించనున్నారు.
ఇంటర్ ఫలితాలు ఆరోజే
ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీలోపు ఏక్షణంలోనైన విడుదల చేయనున్నారు.
కాగా తెలంగాణలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి.తెలంగాణ ఇంటర్ పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 4,78,527 మంది ఫస్టియర్ విద్యార్థులు, 4,43,993 మంది సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాశారు.
ఇక ఈ సారి ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్-2024 ఫలితాలను రికార్డు స్థాయిలో ఒకే ఒక్క క్లిక్‌తో అందరి కంటే ముందుగానే సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) వెబ్‌సైట్‌లో అందుబాటలోకి తీసుకోచ్చింది. ఇలాగే తెలంగాణ ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పబ్లిక్ పరీక్షలు 2024 ఫలితాలను www.sakshieducation.comలో చూడొచ్చు.