Summer Camp for Inter Students: విజ్ఞానం పెంచేందుకే సమ్మర్‌ క్యాంప్‌

మొయినాబాద్‌ రూరల్‌: విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేలా, క్రమశిక్షణ అలవర్చుకునే విధంగా సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహించినట్టు గురుకులాల ఆర్‌సీవో శారద అన్నారు.

15 రోజులుగా మండలంలోని తోల్‌కట్ట సమీపంలో గల చేవెళ్ల గురుకులకళాశాలలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పది కళాశాలలకు చెందిన విద్యార్థినులకు వివిధ రకాల నైపుణ్య కోర్సులను నిర్వహించారు.

మార్చి 30న‌ నిర్వహించిన ముగింపు సమావేశానికి చేవెళ్ల గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ రమాదేవి అధ్యక్షత వహించగా శారద ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

చదవండి: Indian Culinary Institute: ఐసీఐ కోర్సుల్లో ప్రవేశాలు.. యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు..!

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్‌ పరీక్షలు పూర్తి చేసుకున్న విద్యార్థినులు సెలవు దినాల్లో సమయం వృథా చేయకుండా వారి విజ్ఞానాన్ని పెంపొందించేందుకు వేసవి శిబిరం నిర్వహించినట్టు తెలిపారు.

ప్రిన్సిపాల్‌ రమాదేవి మాట్లాడుతూ.. 15 రోజుల పాటు వివిధ మండలాల్లోని ఆయా కళాశాలలకు చెందిన విద్యార్థినులు ఆయా అంశాల్లో తర్ఫీదు పొందారని చెప్పారు. కార్యక్రమంలో బంట్వారం ప్రిన్సిపాల్‌ ఉషారాణి, రవిచంద్‌ తదితరులు పాల్గొన్నారు.

#Tags