Inter Spot Counseling: గురుకులాల్లో ప్రవేశాలకు స్పాట్‌ కౌన్సెలింగ్‌

పాల్వంచ: ఉమ్మడి జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల్లో ప్రవేశాల కోసం జూలై 26, 27వ తేదీల్లో స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇంటర్‌ మొదటి సంవత్సరం జనరల్‌ గ్రూప్‌లతో పాటు ఒకేషనల్‌ గ్రూప్‌ల్లో మిగిలిన సీట్ల భర్తీకి కోసం ప్రభుత్వం అవకాశం కల్పించిందని పేర్కొన్నారు.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

బాలికలకు 26వ తేదీన టేకులపల్లి గురుకులంలో, బాలురకు 27వ తేదీన తిరుమలయపాలెంలో కౌన్సెలింగ్‌ ఉంటుందని, విద్యార్థులు పదో తరగతి మెమో, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ధ్రువపత్రాలతో హాజరుకావాలని అధికారులు సూచించారు.

#Tags