Inter Public Exams 2024 : కీలక నిర్ణయం.. ఇకపై ఇంటర్‌లో ఈ పరీక్ష రద్దు.. పబ్లిక్ పరీక్షల తేదీలు.. ఫీజుల వివరాలు ఇవే..
మరో ఇంటర్నల్ అయిన ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను యథాతథంగా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. వంద మార్కుల ఈ ఇంటర్నల్ పరీక్షను కాలేజీలోనే నిర్వహించి.. అదే కాలేజీ లెక్చరర్లు మూల్యాంకనం చేసి, మార్కులేస్తారు. ఇది క్వాలిఫైయింగ్ పేపర్ కాగా, ఈ మార్కులను రెగ్యులర్ మార్కుల్లో కలపరు. కనుక దీని వల్ల పెద్దగా ఉపయోగం ఉండే అవకాశం లేదరు.
చదవండి: టిఎస్ ఇంటర్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
అలాగే ఈ విద్యాసంవత్సరం నుంచి ఫస్టియర్‌లో ఇంగ్లీషు ప్రాక్టికల్స్ అమలు చేయనుండటంతో థియరీకి, ప్రాక్టికల్స్‌కు వేర్వేరు పాఠ్యపుస్తకాలను బోర్డు సిద్ధం చేసింది. ఇంగ్లిష్ సబ్జెక్టు పుస్తకాల్లో ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్యూస్ పాఠ్యాంశాలు అంతర్భాగంగా ఉండటంతో ప్రత్యేకంగా పరీక్ష అవసరం లేదని అధికారులు భావించి, ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు.
ఇంటర్ పరీక్షల ఫీజులు ఇలా..
ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు మార్చి-2024 కు సంబంధించిన పరీక్ష ఫీజు షెడ్యూల్.., ఫీజు వివరాలను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. ఈ మేరకు ప్రధమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, ఫెయిల్ అయిన విద్యార్థులు, హాజరు లేకుండా పరీక్ష రాసే ప్రైవేట్ అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించడానికి షెడ్యూల్ విడుదలయింది.
ఫీజు చివరి తేదీ ఇదే..
ఎలాంటి అపరాధ రుసుము లేకుండా అక్టోబర్ 26వ తేదీ నుంచి నవంబర్ 14 తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. రూ.100 ఆలస్య రుసుముతో నవంబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 23వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. అలాగే రూ. 500/- రూపాయల ఆలస్య రుసుముతో నవంబర్ 25వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఇంకా రూ. 1,000 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 13 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. రూ.2,000 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 20 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
☛ ప్రథమ సంవత్సరం జనరల్ కోర్స్ అభ్యర్థులు రూ.510/-
☛ ప్రథమ సంవత్సరం ఒకేషనల్ కోర్స్ – ప్రాక్టికల్స్ తో అభ్యర్థులు రూ.730/-
☛ ద్వితీయ సంవత్సరం జనరల్ కోర్స్ ఆర్ట్స్ అభ్యర్థులు రూ.510/-
☛ ద్వితీయ సంవత్సరం జనరల్ కోర్స్ సైన్స్ అభ్యర్థులు రూ.730/-
☛ ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ కోర్స్ అభ్యర్థులు రూ.730/-
☛ Admissions: Interలో నచ్చిన కళాశాలకు మారొచ్చు!