Intermediate First Year Admissions: తెలంగాణ మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరానికి దరఖాస్తులు..
ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశం పొందేందుకు కింద ప్రకటించిన వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోండి..
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ తెలిపారు. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ నెల 25లోగా www.tsmodelschools.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో గ్రూపునకు 40 చొప్పున 160 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రోస్టర్ మెరిట్ ప్రకారం సీట్లు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 27న ఎంపిక జాబితా విడుదల, 29 నుంచి 31 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు.
ITI Admissions 2024: ఐటీఐ అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం, చివరి తేదీ ఎప్పుడంటే..
#Tags