భారతదేశం : భౌగోళిక స్వరూపాలు

ముఖ్యాంశాలు:

 

  1. భారతదేశం చాలా విశాలమైన దేశ ం. ఇది ఉత్తరార్థ గోళంలో ఉంది. భౌగోళికంగా భారతదేశం ఉన్న స్థితి శీతోష్ణస్థితులలో ఎన్నో వైవిధ్వతలకు కారణమవుతుంది.
  2. భారతదేశానికి 82030 తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా పరిగణిస్తారు. ఇది అలహాబాద్ గుండా పోతుంది. భార తదేశ ప్రామాణిక కాలమానానికి దీనినే ఆధారంగా తీసుకుంటారు.
  3. ప్రపంచ భూ భాగమంతా రెండు ప్రధాన భూ ఖండాలు నుంచి ఏర్పడ్డాయి. ఇవి అంగారాభూమి, గోండ్వానా భూమి. భారతదేశం గోండ్వానా భూ భాగంలో ఉంది.
  4. హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె భారతదేశానికి ఉత్తరాన వ్యాపించి వున్నాయి. ఇవి పడమర నుంచి తూర్పుకి 2400 కి.మీ. పొడవు ఉన్నాయి.
  5. హిమాలయాల్లో సమాంతర ంగా ఉండే మూడు పర్వత శ్రేణులు ఉన్నాయి. ఉత్తరాన ‘ఉన్నత హిమాలయాలు’ లేదా ‘హిమాద్రి’ పర్వత శ్రేణి ఉంది. ఇది మంచుతో కప్పి ఉంటుంది. ఇక్కడ హిమానీ నదులు కలవు. ఇది జీవనదులకు నీటిని అందిస్తున్నాయి.
  6. హిమాద్రికి దక్షిణాన ఉన్న పర్వతశ్రేణిని ‘నిమ్న హిమాలయాలు’ అంటారు. వీటిని ‘హిమాచల్’ అని పిలుస్తారు. ఈ శ్రేణిలో పిర్‌పంజాల్, మహాభారత పర్వత శ్రేణుల కలవు.
  7. హిమాలయాల్లో దక్షిణాన ఉన్న శ్రేణిని ‘శివాలిక్ శ్రేణి’ అంటారు. నిమ్న హిమాలయ, శివాలిక్ శ్రేణుల మధ్య ప్రసిద్ధి గాంచిన ‘డెహ్రాడూన్, కోట్లిడూన్, పాట్లిడూన్’ లు కలవు.
  8. హిమాలయాలకు తూర్పు సరిహద్దుగా బ్రహ్మపుత్ర లోయ ఉంది. భారతదేశానికి తూర్పు సరిహద్దుగా వున్న హిమాలయాలను ‘పూర్వాంచల్’ అంటారు.
  9. హిమాలయాల వల్ల భారతదేశ శీతోష్ణస్థితి అనేక విధాలుగా ప్రభావితం అవుతుంది. ఇది భారతదేశ ఉత్తర సరిహద్దులో రక్షణ కవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుంచి వచ్చే చల్లటి గాలులను అడ్డుకుంటున్నాయి.
  10. భారతదేశంలోని ‘రుతు పవన తరహా శీతోష్ణస్థితి’ కి హిమాలయాలే కారణం. హిమాలయాలు లేకపోతే, ఉత్తర ప్రాంతం పొడిగా ఉండేది. హిమాలయ నదులు కిందకి తె చ్చే ‘బండ్రు మట్టి’ వల్ల మైదాన ప్రాంతాలు చాలా సారమంతంగా మారాయి.
  11. మూడు హిమాలయ నదులైన గంగా, సింధు, బ్రహ్మపుత్ర,వాటి ఉపనదుల వల్ల విశాల ఉత్తర మైదానం ఏర్పడింది. భారతదేశంలో ఉన్న పంజాబ్, హర్యానా మైదానాలలో సారవంతమైన ‘అంతర్వేదులు’ కలవు. రెండు నదుల మధ్య ప్రాంతం ‘అంతర్వేది’ అంటారు.
  12. హిమాలయ నదులు కిందకి ప్రవహించే క్రమంలో రాళ్లు, గులక వంటి వాటిని శివాలిక్ పర్వత పాదాలచెంత సన్నటి మేఖలగా నిక్షేపణ చేస్తాయి. దీనినే ‘భాబర్’ అంటారు.
  13. సచ్ఛిద్రంగా ఉండే నదులు, వాగుల వల్ల ఏర్పడిన చిత్తడి నేలలను ‘టేరాయి’ ప్రాంతం అంటారు.
  14. భారతదేశ పీఠభూమికి మూడువైపుల సముద్రాలు ఉన్నాయి కాబట్టి దీనిని ‘ద్వీపకల్ప పీఠ భూమి’ అని కూడా అంటారు. ఇది పురాతన స్ఫటికాకార, క ఠినమైన అగ్నిశిలలు, రూపాంతర శిలలతో నిర్మితమైనది.
  15. దక్కన్ పీఠభూమి పడమర నుంచి తూర్పుకు వాలి ఉంది. గూడ లూరు వద్ద నీలగిరి పర్వతాలు పడమటి కనుమలను కలుస్తాయి. ప్రఖ్యాతి గాంచిన వేసవివిడిది ‘ఉదక మండలం’ (ఊటి) నీలగిరి పర్వతాలలో ఉంది. ఈ పర్వతాలలో ఎత్తై శిఖరం దొడబెట్ట(2637 మీ..). భారతదేశంలో అన్నావులై కొండలలోని ‘అనైముడి’(2695 మీ.) ఎత్తై శిఖరం.
  16. ఉత్తరాన మహానది లోయ నుంచి దక్షిణాన నీలగిరి వర కు తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. తూర్పు కనుమలలో ఎత్తై పర్వతం అరోమ కొండ చింతపల్లి దగ్గర ఉంది.
  17. ఆరావళి పర్వతాల వర్షచ్ఛాయా ప్రాంతంలో థార్ ఎడారి ఉంది. రాజస్థాన్‌లోని అధిక భాగం ఈ ఏడారి విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో అంతస్థలీయ ప్రవాహంగా వున్న నది ‘లూని’.
  18. పడమటి తీర మైదానంరాణ్ ఆఫ్ కచ్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపించి ఉన్నవి. తూర్పు తీర మైదానం కంటే పడమటి తీరం వెడల్పు తక్కువ.
  19. తూర్పు తీర మైదానం ఒడిశాలోని మహానది నుంచి తమిళనాడులో కావేరి డెల్టా వరకు విస్తరించి ఉంది. మహానది, గోదావరి, కృష్ణ, కావేరి నదులతో ఏర్పడిన ఈ మైదాన ప్రాంతాలు మిక్కిలి సారవంతమైనది.
  20. భారతదేశ ద క్షిణాది అంచు నికోబార్ దీవిలోని ఇందిరా పాయింట్ దగ్గర ఉంది. లక్ష ద్వీప దీవులు ప్రవాళభిత్తికల (కోరల్స్) నుంచి ఏర్పడ్డాయి.

కీలక భావనలు:

 

 

  1. జీవనది: నిరంతరం సంవత్సరం పొడవుగా నీరు కలిగి వుండి ప్రవహించు నదులు జీవనదులు. హిమానీన దాల నుంచి నీళ్లు అందుట వలన హిమాలయ నదులు సంవ త్సరం పొడవునా నీళ్లు కలిగి ఉంటాయి.
  2. ద్వీపకల్పం: ఏదైనా భూ భాగం మూడు వైపుల నీటితో సరిహద్దుగా వుండి ఒక వైపు ప్రధాన భూభాగం క లిగి ఉంటే దానిని ద్వీపకల్పంగా వ్యవ హారిస్తారు. భారతదేశానికి మూడు వైపుల సముద్రాలతో కూడిన తీర ప్రాంతం కలదు. భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం, దక్షిణాన హిందూమహాసముద్రం కలవు. భారతదేశం ఒక ద్వీపకల్పం.
  3. గోండ్వానా భూమి: ప్రపంచ భూభాగమంత రెండు ప్రధాన భూఖండాల నుంచి ఏర్పడ్డాయి. అవి అంగారాభూమి, గోండ్వానా భూమి. భారతదేశ ద్వీపకల్పం గోండ్వానా భూభాగం లోనిది.
  4. లారేసియా: అంగారాభూమిని లారేసియాగా పిలుస్తారు. యూరేషియా ఖండ ఫలకం అధిక భాగం లారేసియా.
  5. అంగారాభూమి: పాంజీయాలోని విడిపడిన ప్రధానమైన భూఖండం అంగారాభూమి. భారతదేశ ద్వీపకల్పం ఫలకం ఈశాన్య దిశగా పయనించి యురేషయా ఫలకం (అంగారా భాగం)తో ఢీ కొంది.
  6. డూన్: నిమ్మ హిమాలయ, శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే లోయలను స్థానికంగా ‘డూన్’ అంటారు. వీటిలో కొన్ని ప్రసిద్ధి గాంచిన డూన్‌లు. డెహ్రాడూన్, కోట్లి డూన్, పాట్లి డూన్ మొదలైనవి.
  7. శివాలిక్: హిమాలయాల్లో అన్నిటి కంటే దక్షిణాన ఉన్న శ్రేణిని శివాలిక్ శ్రేణి అంటారు. ఈ పర్వతాలను జమ్ము ప్రాంతంలో జమ్ము కొండలు అనీ, అరుణాచల్ ప్రదేశ్‌లో మిష్మికొండలు అనీ, అస్సాంలో కచార్ అనీ రకరకాల పేర ్లతో పిలుస్తారు.
  8. పూర్వాంచల్: భారత్ దేశానికి తూర్పు సరిహద్దుగా ఉన్న హిమాలయాలను ‘పూర్వాంచల్’ అంటారు. ప్రాంతీయంగా వీటిని పాట్‌కాయ్ కొండలు, నాగాకొండలు, మణిపురి కొండలు, ఖాసికొండలు, మిడో కొండలుగా పిలుస్తారు.
  9. కోరల్స్: సముద్ర గర్భంలో సున్నం, కార్బన్‌లతో సమ్మిళితంగా ఏర్పడు నీటి నిర్మాణాన్ని ‘కోరల్’ అని పిలుస్తారు. సముద్ర గర్భ జీవ జాలం.

వ్యాసరూపక ప్రశ్నలు

 

 

  1. భారతీయ వ్యవసాయాన్ని హిమాలయాలు ఏరకంగా ప్రభావితం చేస్తున్నాయి?
    జ:
    a) వేసవిలో వర్షాలకు, పశ్చిమ కనుమలు దాటిన తరువాత ప్రాంతంలో రుతుపవన తరహా శీతోష్ణస్థితికి హిమాలయాలే కారణం. అవే లేకపోతే ఉత్తర ప్రాంతం పొడిగా ఉండేది.
    b) హిమానీ నదాల నుంచి నీళ్లు అందుట వల్ల హిమాలయ నదులు సంవత్సరం పొడవునా నీళ్లు కలిగి ఉంటాయి. గంగా,సింధు, బ్రహ్మాపుత్ర లు మొదలైన ఉత్తర భారత దేశంలో ప్రవహించే నదులు హిమానీ నదాల నుంచి నిరంతరం నీళ్లు పొందుట వల్ల జీవనదులుగా పిలుస్తున్నారు. ఉత్తర మైదాన ప్రాంతాల ఆర్థికాభివృద్ధి తో ఈ నదులు ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి.
    c) హిమాలయ నదులు కిందకి ప్రవహించే క్రమంలో రాళ్లు, గులకరాళ్లు వంటి వాటిని శివాలిక్ పర్వతాల పాదాలచెంత సన్నటి మేఖలుగా విక్షేపణ చేస్తాయి. ఈ భూ స్వరూపాన్ని ‘ఖాబర్’ అంటారు.
    d) నూతన బండ్రు మట్టి ప్రాంతాలు, పాత బండ్రుమట్టి నేలలు అత్యంత సారవంతమైన ప్రాంతాలు. వ్యవసాయ భూముల కింద మారిన తరాయి ప్రాంతాలు పంటలు పుష్కలంగా పండుటకు యోగ్యమైనవి.
    e) భారతదేశంలో అత్యధికంగా వరి, గోధుమ పంటలను హిమాలయాల వల్ల రూపొందిన బండ్రు మట్టి గల మైదాన ప్రాంతాలలో పండించుతున్నారు.
    f) భారతదేశంలో వ్యవసాయం రంగం ప్రముఖమైనది. భారతీయ వ్యవసాయాన్ని అత్యధికంగా హిమాలయాలు ప్రభావితం చేస్తున్నాయి.
  2. గంగా - సింధూనది మైదానంలో జనసాంద్రత ఎక్కువ. కారణాలను తెలపండి.
    జ:
    1) మూడు హిమాలయ నదులైన గంగా, సింధు, బ్రహ్మాపుత్రలు, వాటి ఉపనదుల వల్ల విశాల ఉత్తర మైదానం ఏర్పడింది.
    2) ఈ నదులు కొండల నుంచి కిందకి తెచ్చి బండ్రుమట్టి వల్ల మైదాన ప్రాంతాలు చాలా సారవంతంగా మారాయి.
    3) సారవంతమైన నేలలు సమతలమైన ఉపరితల స్వభావం, నిదానంగా ప్రవహించే జీవనదులు, అనుకూలమైన శీతోష్ణస్థితి పరిస్థితులు మొదలైన లక్షణాలతో కూడివున్న గంగా- సింధు మైదానం వ్యవసాయాభివృద్ధికి ప్రఖ్యాతిగాంచినది.
    4) నదులు అత్యంత ప్రముఖ సహాజవనరులు. వ్యవసాయానికి కావలసినంత సేద్యపు నీటిని అవి సమకూర్చుతున్నాయి. అందువల్ల మైదాన ప్రాంతంలో పంటలు పుష్కలంగా పండుతున్నాయి. నదులు జలరవాణాకు, జలవిద్యుత్ ఉత్పత్తి చేయడానికి గృహా, పారిశ్రామిక అవసరాలకు కావలసినంత నీటిని అందింస్తున్నాయి.
    5) నివాసయోగ్యమైన ప్రాంతాలైనందు వల్ల మైదానాలు ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. అందువల్ల, జనసంఖ్య, జనసాంద్రత గంగా-సింధు మైదాన ప్రాంతంలో అధికంగా ఉంది.
    6) మనదేశం ప్రధానంగా వ్యవసాయిక దేశం అయినందువల్ల, సుమారు 70% మంది ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయం,దాని అనుబంధ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం కొనసాగించుట వల్ల, గంగా - సింధు మైదానంలో అధిక జనసాంద్రత కలదు.
  3. భారతదేశ ప్రధాన భౌగోళిక విభజనలు ఏవి? హిమాలయ ప్రాంత భౌగోళిక పరిస్థితులతో ద్వీపకల్ప పీఠభూమిని పోల్చండి.
    జ:
    ముఖ్యమైన భౌగోళిక స్వరూపాలు:
    భారతదేశ భూభాగాన్ని కింద పేర్కొన్న భౌగోళిక స్వరూపాలుగా వర్గీకరించవచ్చును.
    1. హిమాలయాలు
    2. గంగా- సింధూనది మైదానం
    3. ద్వీపకల్ప పీఠభూమి
    4. తీర ప్రాంతమైదానాలు
    5. ఎడారి ప్రాంతం
    6. దీవులు

 

హిమాలయ పాంతం

ద్వీపకల్ప పీఠభూమి

1. భారతదేశానికి ఉత్తర సరిహద్దుగా హిమాలయ పర్వత శ్రేణులు కలవు.

1. ద్వీపకల్ప పీఠభూమి మూడువైపుల సముద్రాల చేత తీరప్రాంతాలతో కూడి ఉంది.

2. హిమాలయాలు మంచుచేత కప్పి వున్నది. హిమనీనదాలు వల్ల ఈ ప్రాంతంలో జీవనదులు ఏర్పాడాయి. నిరంతరం సంవత్సరం పోడవునా ఈ నదులలో నీరు ప్రవహిస్తునే ఉంటుంది.

2. ద్వీపకల్ప పీఠభూమిలో కొండలు మధ్యలో విశాలమైన లోతైన లోయలు ఉంటాయి.

3. హిమాలయాలు ఒక చాపం వలె పడమర నుంచి తూర్పుకి 2400 కి.మీ పొడవున విస్తరించి ఉన్నాయి.

3.ద్వీపకల్ప పీఠభూమి పడమర నుంచి తూర్పుకు వాలి ఉంది.

4. హిమాద్రికి దక్షిణాన ఉన్న నిమ్న హిమాలయాల్లో అనేక ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్, కులు, కాంగ్రలోయలు కలవు.

4.ద్వీపకల్ప పడ మర అంచుగా పడమటి కనుమలు, తూర్పు అంచుగా తూర్పు కనుమలు ఉన్నాయి.

5. హిమాలయ ప్రాంతాలు హిమనీనదుల చేత కొండలు నుంచి కిందకి తె చ్చే బండ్రుమట్టి వ ల్ల మైదాన ప్రాంతాలు చాలా సారవంతంగా మారాయి.

5. ద్వీపకల్ప పీఠభూమి పురాతన స్ఫటికాకార, కఠిన అగ్ని శిలలు, రూపాంతర శిలలతో నిర్మితమైనది. ఇందులో లోహా, అలోహా ఖనిజ వసరులు పెద్ద మొత్తంలో ఉన్నాయి.

6. గంగా, సింధు, బ్రహ్మాపుత్ర నదులు, వాటి ఉపనదులు వల్ల ఈ ప్రాంతం అత్యంత సారవంతమైన మృతికలు కల్గి ఆహార, నగదు పంటలు పండుటకు యోగ్యమైనదిగా ఉంది.

6. ఛోటా నాగ్‌పూర్ పీఠభూమిలో ఖనిజ వనరులను సమృద్ధిగా కలిగి ఉంది. నల్ల రేగడి మృత్తికలు దక్కన్ పీఠభూమిలో అగ్నిపర్వత ప్రక్రియవల్ల ఏర్పడ్డాయి.

7. హిమాలయ నదులు జీవనదులు

7.ద్వీపకల్ప నదులు వర్షాధార నదులు. జీవనదులు కావు.

8. బహుళ పంటలకు కావలసినంత నీటిని హిమాలయ నదులు అందిస్తున్నాయి.

8. ద్వీపకల్ప నదులు జీవనదులు కానందు వల్ల, రెండో పంటకు సాగునీటి కోసం చెరువులు, బోరుబావులపై ఆధారపడవలసి ఉంటుంది.

 


సంక్షిప్త సమాధాన ప్రశ్నలు:

 

 

  1. పశ్చిమాన ఉన్న గుజరాత్‌లో కంటే అరుణాచల్ ప్రదేశ్‌లో సూర్యోదయం రెండు గంటలముందు అవుతుంది. కానీ గడియారాలు ఒకే సమయం చూపిస్తాయి. ఎందుకని?
    1. భారతదేశానికి 820.30 తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా పరిగణిస్తారు. ఇది అలహాబాద్ గుండా పోతుంది. భారతదేశ ప్రామాణిక కాలమానానికి దీనినే ఆధారంగా తీసుకుంటారు. దీనినే దేశమొత్తం పాటిస్తుంది.
    2. అరుణాచల్ ప్రదేశ్‌లో మొదటిగా సూర్యోదయం అవుతుంది. దేశంలో చివరిగా సూర్యోదయం గుజరాత్‌లో జరుగుతుంది. సుమారు 300 రేఖాంశాల విస్తరణ వల్ల ఇది జరుగుతుంది. తూర్పు, పడమరల మధ్య గల దూరం దీనికి కారణమవుతుంది. అంటే భారతదేశ ప్రామాణిక కాలమానం ఆచరించుట వల్ల గడియారాలు అన్ని ఒకే సమయం చూపిస్తాయి.
  2. హిమాలయ పర్వతాలు ప్రస్తుతం ఉన్న స్థానంలో లేకపోతే, భారత ఉపఖండ శీతోష్ణస్థితులు ఎలా ఉండేది?
    1. భారతదేశ శీతోష్ణస్థితి పై హిమాలయాలు తగిన ప్రభావాన్ని కలిగిస్తోంది.
    2. ఇవి భారతదేశ ఉత్తరసరిహద్దులలో రక్షణకవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుంచి వచ్చే చల్లటి గాలులను అడ్డుకుంటాయి.
    3. వేసవిలో వర్షాలకు, పశ్చిమ కనుమలు దాటిన తరువాత ప్రాంతంలో రుతుపవన తరహా శీతోష్ణస్థితికి హిమాలయాలే కారణం.
    4. హిమాలయాలు లేకపోతే ఉత్తర ప్రాంతం పొడిగా ఉండేది.
    5. హిమానీనదాల నుంచి నీళ్లు అందటంతో హిమాలయ నదులు సంవత్సరం పొడవున నీళ్లు కలిగి ఉంటాయి.
      ఒక వేళ హిమాలయ పర్వతాలు ప్రస్తుతం ఉన్న స్థానంలో లేకపోతే, భారత ఉపఖండ శీతోష్ణస్థితులలో విభిన్నమైన మార్పులు సంభవించి వుండే వి.
  3. ఇక్కడ పేర్కొన్న వాటిల్లో ఏఏ రాష్ట్రాల్లోనికి హిమాలయాలు విస్తరించి లేవు. మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, సిక్కిం, హర్యానా, పంజాబ్, ఉత్తరాంచల్.
    జ:
    మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానాలలో హిమాలయాల విస్తరణలేదు.
  4. తూర్పుమైదాన ప్రాంతాలు, పడమటి మైదాన ప్రాంతాల మధ్య పోలికలు తేడాలు ఏమిటి?

    తూర్పు తీర మైదానం

    పశ్చిమ తీర మైదానం

    1. తూర్పుతీర మైదానం తూర్పు కనుమలకు బంగాళాఖాతానికి మధ్య విస్తరించి ఉన్నది.

    1. పశ్చిమ తీరామైదానం పశ్చిమ కనుములకు అరేబియా సముద్రాలకు మధ్యన విస్తరించి ఉంది.

    2. స్థానికంగా తూర్పుతీర మైదానాన్ని ఉత్కళ తీరం, సర్కారు తీరం, కోర మండల్ తీరంగా పిలుస్తారు.

    2. దీనిని కొంకణ తీరం, కెనరా తీరం మలబారు తీరంగా పిలుస్తారు.

    3. తూర్పు తీరం నందు మైదానం ఎక్కువ వెడల్పు కలిగి వుంది. దీని వెడల్పుసగటున 120 కి.మీలు.

    3. పశ్చిమ తీరమైదానం తక్కువ వెడల్పు కల్గి ఉంది. దీని వెడల్పుసగటున 65 కి.మీలు.

    4. తూర్పు తీర మైదానం ఆహార పంటల సేద్యానికి అనుకూలమైనది.

    4. పశ్చిమ తీర మైదానం నగదు/వ్యాపార పంటలకు అనువైనది.

    5. తూర్పు తీర మైదానంలో సారవంతమైన ‘డెల్టా’లు కలవు.

    5. ఎలాంటి నదులు పశ్చిమ తీర మైదానంలో ప్రవహించకపోవడం వల్ల ‘డెల్టా’లు లేవు.

    6. తూర్పుతీర మైదానంలో చిల్క, కోలేరు, పులికాట్ సరస్యులు కలవు.

    6. ఈ మైదానంలో ఎలాంటి సరస్సులు లేవు.

  5. భారతదేశంలోని మైదాన ప్రాంతాలు వ్యవసాయానికి దోహదపడినంతగా పీఠభూమి ప్రాంతాలు తోడ్పడవు - దీనిని కారణాలు ఏమిటి?
    1. భారతదేశ పీఠభూమికి మూడు వైపుల సముద్రాలు కలవు. ఇది ప్రధానంగా పురాతన స్ఫటికాకార, కఠినమైన అగ్నిశిలలు, రూపాంతర శిలలుతో కూడివుంది.
    2. భారత పీఠ భూమిలో లోహ, అలోహ ఖనిజ వనరులు పెద్ద మొత్తం లో కలవు.
    3. గంగా మైదానంతో పోల్చితే పీఠ భూమి ప్రాంతం పొడిగా వుంటుంది.
    4. ఇక్కడి నదులు జీవనదులు కావు. రెండవ పంటకు సాగునీటి కోసం చెరువులు, బోరుబావులపై ఆధారపడవలసి ఉంటుంది.
      కనుక పీఠభూమి ప్రాంతాలు మైదాన ప్రాంతాలతో పోలిస్తే వ్యవసాయానికి అంతగా దోహదపడలేవు.

 

#Tags