‘Eklavya’లో స్థానికులకు సీట్లు కేటాయించాలి
కోనరావుపేట(వేములవాడ): ఏకలవ్య గురుకుల పాఠశాలలో స్థానికులకు 10 శాతం సీట్లు కేటాయించాలని లైవ్ జిల్లా అధ్యక్షుడు బానోత్ నరేశ్‌కుమార్ కోరారు.
మరిమడ్లలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను జూన్ 24న సందర్శించి మాట్లాడారు. మరిమడ్లలోని ఏకలవ్య స్కూల్‌లో సీబీఎస్‌ఈ సిలబస్ అమలు చేయడంతో స్థానిక గిరిజన విద్యార్థులకు సీట్లు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి: Eklavya Schools: ఏకలవ్యలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
గతంలో ఒక తరగతిలో 80 సీట్లు ఉంటే ప్రస్తుతం 60కి తగ్గించారని.. ఈ సీట్లను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులతో భర్తీ చేస్తుండడంతో స్థానికులకు అన్యాయం జరుగుతుందన్నారు. మరో గిరిజన ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీనివాస్. కుమ్మరి దిలీప్‌కుమార్, వెంకటేశ్, జింక రాజేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
#Tags