Question Papers Leak: ఎస్‌ఏ–1 పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్
ఫిజిక్స్, హిందీ పరీక్ష పేపర్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టగా కొందరు విద్యార్థులు వాటిని మాత్రమే చదువుకుని పరీక్షలకు హాజరవుతుండటం పట్ల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తారతమ్యం లేకుండా కచ్చితంగా నిర్వహించే ఎస్‌ఏ–1 పరీక్షలు ప్రాక్టికల్ మార్కులను నిర్ధారించేందుకు ఉపయోగపడతాయి. అయితే ఉదయం 9.30 నిమిషాలకు తెరవాల్సిన పరీక్ష పత్రాల బండిల్స్‌ను అంతకుముందు రోజే తెరచి ప్రశ్నపత్రాలను పాఠశాల విద్యార్థులకు ఇస్తున్నట్లు సమాచారం.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
బిట్ పేపర్లలో సమాధానాలు పెట్టి మరీ సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తుండటంతో ఉపాధ్యాయులే విద్యార్థులను మాల్ ప్రాక్టీస్‌కు ప్రోత్సహిస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎంఈఓ పర్యవేక్షణ లేకపోవడంతోనే ప్రశ్నపత్రాలు లీకవుతున్నాయని, డీఈఓ స్పందించి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు పేర్కొంటున్నారు. కాగా ఈ విషయమై ఎంఈఓ వీరాస్వామిని వివరణ కోరగా.. విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.