Collector Deepak Tiwari: నాణ్యమైన విద్య, వైద్యం అందించాలి

సిర్పూర్‌(టి): గురుకులాల విద్యార్థులకు మెరుగైన విద్య, వైద్యం అందించాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు.

మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రితోపాటు సాంఘిక సంక్షేమ బాలి కల గురుకుల పాఠశాలను ఆగ‌స్టు 16న‌ తనిఖీ చేశా రు. ఆయన మాట్లాడుతూ పాఠశాలలు, గురుకులా ల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

చదవండి: School Admisssions 2024: బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లకు విద్యార్థుల ఎంపిక

ఆరోగ్య స్థితిగతులు తెలుసుకునేందుకు తరచూ వైద్యపరీక్షలు చే యించాలన్నారు. ఆస్పత్రిలో సిబ్బంది నిత్యం ప్రజ లకు అందుబాటులో ఉంటూ వైద్యసేవలందించాల ని ఆదేశించారు. గురుకుల పాఠశాలలో వైద్యశిబిరా న్ని పరిశీలించి, విద్యార్థుల ఆరోగ్య వివరాలు తెలు సుకున్నారు. ఆయన వెంట డీపీవో భిక్షపతి, సామాజిక ఆస్పత్రి వైద్యాధికారి చెన్నకేశవ, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో సత్యనారాయణ, లోనవెల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి నవత, సిబ్బంది ఉన్నారు.

#Tags