Penugonda ZP High School: పరదా కడితే.. పడదా?

కేసముద్రం: తరగతి గదుల్లో పెచ్చులు ఊడిపడుతున్న ఓ బడిలో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువు నెట్టు­కొచ్చేస్తున్నారు.

తాత్కాలికంగా పరదాలు కట్టి అడ్డు పెట్టినా ఒక్కోసారి పెద్ద పెద్ద పెచ్చులను పరదాలు కూడా ఆపలేక­పో­తున్నాయి. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పిల్లల దు­స్థితి మాత్రం మారలేదు. 

మహబూబాబాద్‌ జిల్లా కేసము­ద్రం మండలం పెనుగొండ జెడ్పీ హైస్కూల్‌లో 165 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 9 గదులకు గాను ఒక గది స్టోర్‌ రూం, మరో గది స్టాఫ్‌కు కేటాయించారు. పాఠశాలలో స్లాబ్‌ శిథిలావస్థకు చేరుకోవడంతో పెచ్చులు ఊడిపడుతూ, ఇనుప సలాక్‌లు కిందకు వేలాడుతున్నాయి. 

చదవండి: Schools news: సర్కార్‌ బడుల్లో మూలకు పడ్డ కంప్యూటర్లు

ఇలా నాలుగు తరగతి గదుల్లో పై పెచ్చులు పడుతుండటంతో వాటిని తప్పించుకునేందుకు పిల్లలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీస్తున్నారు. ఇక వర్షం పడినప్పుడల్లా స్లాబ్‌ కురుస్తుండటం, దాంతో పాటు పెచ్చులు పడుతుండటంతో పిల్లలను పక్కనే ఉన్న డైనింగ్‌ హాల్‌లో కూర్చోబెడుతున్నారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని పాఠశాల ప్రధానోపాధ్యా­యుడు యాదగిరి తెలిపారు.

#Tags