Madhusudan: విద్యారంగంలో కీలక పాత్ర
నిర్మల్ ఖిల్లా: విద్యారంగంలో తమవంతు పాత్ర పోషిస్తున్నామని ప్రైవేటు పాఠశాలల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ అన్నారు.
జూలై 30న జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేలాది మంది నిరుద్యోగులు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తూ ఉపాధ్యాయులుగా ఉపాధి పొందుతున్నారన్నారు.
చదవండి: DEO Praneetha: విద్యార్థులకు మరింత పోషకాహారం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆరువేల ప్రైవేటు పాఠశాలల్లో దాదాపు 32 లక్షల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారని, ఇందుకు తాము అందిస్తున్న నాణ్యమైన విద్యనే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేశ్‌రావు, కోశాధికారి పి.రాఘవేంద్రరావు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్, పట్టణ అధ్యక్షుడు శ్రీధర్, పట్టణ కార్యదర్శి శ్యాం సుందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుధాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
#Tags