Sub Inspector of Police TVR Suri: ఆ ఇద్దరి చదువుల బాధ్యత నాదే
చర్ల రూరల్: తల్లిదండ్రులను కోల్పోయినా విద్యలో రాణిస్తున్న ఇద్దరు పేద విద్యార్థినులను దత్తత తీసుకుని, వారి చదువుల బాధ్యతను చర్ల ఎస్సై టీవీఆర్.సూరి స్వీకరించారు.
చర్లలోని కస్తూర్భా పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన పదో తరగతి విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనిత, తల్లిని కోల్పోయిన శిరీష పరిస్థితి తెలుసుకుని చలించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ విద్యార్థినులిద్దరు ఎంత వరకు చదివినా తనదే బాధ్యత అని, ఏ ప్రాంతంలో ఉన్నా వారికి సహకరిస్తానని తెలిపారు.
చదవండి: BSF's First Woman Sniper: బీఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా స్నైపర్
ఆడపిల్లలు క్రమశిక్షణతో విద్యలో రాణించి ప్రయోజకులై ఇంకొందరికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఇప్పటికే పినపాక మండలంలో ముగ్గురు విద్యార్థినులను దత్తత తీసుకుని చదివిస్తున్న ఎస్సై, ఇప్పుడు ఇంకో ఇద్దరి చదువు బాధ్యత స్వీకరించడంపై పలువురు అభినందించారు.
#Tags