TS Gurukulam Jobs Exam Hall ticket 2023 Download Link : తెలంగాణ గురుకులం హాల్‌టికెట్లు విడుద‌ల.. పరీక్షల తీరు- తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ గురుకుల విద్యాసంస్ధల నియామక బోర్డు 9,210 ఉద్యోగాల‌కు ఆగస్టు 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించ‌నున్న విష‌యం తెల్సిందే. ఈ ప‌రీక్ష‌లు 18 రోజులపాటు మూడు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి.
TS Gurukulam Jobs Exam Hall ticket 2023 Download

ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన  హాల్‌టికెట్లుల‌ను జూలై 24వ తేదీన (సోమ‌వారం) విడుద‌ల చేసింది.
ఈ హాల్‌టికెట్లల‌ను https://treirb.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ వివరాలతో గురుకుల బోర్డు వెబ్‌సైట్లో లాగిన్‌ అయినప్పుడు దరఖాస్తు చేసిన సబ్జెక్టుల పోస్టుల హాల్‌టికెట్లు కనిపిస్తాయి. 

ఈ తెలంగాణ గురుకులం ఉద్యోగాలు కేటగిరీ, సబ్జెక్టుల వారీగా ప్రతిరోజూ మూడు షిప్టుల్లో పరీక్షలు ఉంటాయి. మొదటి షిఫ్టు పరీక్ష ఉదయం 8.30 నుంచి 10.30 వరకు, రెండో షిప్టు పరీక్ష మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 వరకు, మూడో షిఫ్టు పరీక్ష సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌ని గురుకుల నియామక బోర్డు వర్గాలు వెల్లడించాయి.ఈ 9,210 పోస్టులకు గాను 2.63 లక్షల మందికి పైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు.ఒక్క పోస్టుకు సగటున 29 మంది అభ్యర్ధులు పోటి పడుతున్నారు.

ఈ గురుకులం ఉద్యోగం కొట్టాలంటే.. ఎలాంటి వ్యూహాల‌ను అనుస‌రించాలి..? ప‌రీక్ష ఎలా రాస్తే.. మంచి స్కోర్ చేయ‌వ‌చ్చు..? ప‌రీక్ష రాసే స‌మ‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు పాటించాలి..? క‌టాఫ్ మార్కులు ఎంత ఉండోచ్చు.. మొద‌లైన అంశాల గురించి ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు, Emily Academy Director Dr Moses గారిచే సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్(www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ కింది వీడియోలో చూడొచ్చు.

#Tags