TS Gurukulam Jobs Exam Hall ticket 2023 : తెలంగాణ గురుకులం హాల్‌టికెట్లు విడుద‌ల తేదీ ఇదే.. ప్రతిరోజూ మూడు షిప్టుల్లో పరీక్షలు ఇలా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : 9,210 ఉద్యోగాల‌కు తెలంగాణ గురుకుల విద్యాసంస్ధల నియామక బోర్డు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఈ పోస్టుల‌కు ఆగస్టు 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది.
ts gurukulam jobs exam hall ticket 2023

అలాగే ఈ గురుకులం ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన హాల్‌టికెట్లు జూలై 24వ తేదీన‌ నుంచి (https://treirb.telangana.gov.in/) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయ‌ని గురుకుల విద్యాసంస్ధల నియామక బోర్డు తెలిపింది. అభ్యర్థులు తమ వివరాలతో గురుకుల బోర్డు వెబ్‌సైట్లో లాగిన్‌ అయినప్పుడు దరఖాస్తు చేసిన సబ్జెక్టుల పోస్టుల హాల్‌టికెట్లు కనిపిస్తాయి. ఈ 9,210 పోస్టులకు గాను 2.63 లక్షల మందికి పైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు.ఒక్క పోస్టుకు సగటున 29 మంది అభ్యర్ధులు పోటి పడుతున్నారు.

కేటగిరీ, సబ్జెక్టుల వారీగా ప్రతిరోజూ మూడు షిప్టుల్లో..
ఈ తెలంగాణ గురుకులం ఉద్యోగాలు కేటగిరీ, సబ్జెక్టుల వారీగా ప్రతిరోజూ మూడు షిప్టుల్లో పరీక్షలు ఉంటాయి. మొదటి షిఫ్టు పరీక్ష ఉదయం 8.30 నుంచి 10.30 వరకు, రెండో షిప్టు పరీక్ష మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 వరకు, మూడో షిఫ్టు పరీక్ష సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌ని గురుకుల నియామక బోర్డు వర్గాలు వెల్లడించాయి.

తెలంగాణ‌లో గురుకులం ఉద్యోగాల‌ ప‌రీక్ష‌లకు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులు..
ఈ గురుకులం ఉద్యోగం కొట్టాలంటే.. ఎలాంటి వ్యూహాల‌ను అనుస‌రించాలి..? ప‌రీక్ష ఎలా రాస్తే.. మంచి స్కోర్ చేయ‌వ‌చ్చు..? ప‌రీక్ష రాసే స‌మ‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు పాటించాలి..? క‌టాఫ్ మార్కులు ఎంత ఉండోచ్చు.. మొద‌లైన అంశాల గురించి ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు, Emily Academy Director Dr Moses గారిచే సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్(www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ కింది వీడియోలో చూడొచ్చు.

#Tags