APPSC Ranker Success Story: వ‌రుస‌గా రెండుసార్లు గ్రూప్-1 తో పోస్టు కొట్టిన యువ‌తి.. ఇప్పుడు?

డిప్యూటీ క‌లెక్ట‌ర్ ఆమె తండ్రి క‌ల‌. అది నెర‌వేర్చ‌డమే ఆమె ల‌క్ష్యం. అలా గ్రూప్-1 కు సిద్ధ‌ప‌డి రెండుసార్లు స‌త్తా చాటింది సంత‌బొమ్మాళి మండ‌లానికి చెందిన సువ‌ర్ణ. ఈ సంద‌ర్భంగా ఆమె ప్ర‌యాణం తెలుసుకుందాం..
Group-1 ranker Suvarna achieved her goal

వరుసగా రెండో ఏడాది కూడా పరపటి సువర్ణ గ్రూప్‌–1 పోస్టు కొట్టేశారు. 2022 గ్రూప్‌–1 పరీక్షల్లో సత్తా చాటి జిల్లా కేంద్రంలో జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయ పరిపాలనాధికారి (ఏఓ)గా బాధ్యత స్వీకరించి, శిక్షణలో ఉండగానే మళ్లీ తాజాగా ప్రకటించిన గ్రూప్‌–1 పరీక్షల్లో ఏకంగా డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుకు ఎంపికై రికార్డు సృష్టించారు.

Constable Certificates Verification: రెండు రోజుల‌పాటు కానిస్టేబుల్ స‌ర్టిఫికెట్ ప‌రిశీల‌న‌

సంతబొమ్మాళి మండలం ఆకాశలక్కవరం గ్రామానికి చెందిన పరపటి ధర్మారావు కుమార్తె సువర్ణ ఉస్మానియా యూనివర్సిటీలో జాగ్రఫీలో పీజీ పూర్తి చేశారు. అనంతరం సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతుండగా, 2022లో తొలి ప్రయత్నంలోనే గ్రూప్‌–1కు అర్హత సాధించారు. అనంతరం మళ్లీ తాజాగా డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు.

New Scheme for UPSC Candidates: ఏపీ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన కొత్త ప‌థ‌కం

కలెక్టర్‌గా చూడాలన్నది నాన్న కల

నన్ను కలెక్టర్‌గా చూడాలన్న నాన్న కల నెరవేర్చుతాను. ప్రస్తుతానికి రెండు సార్లు వరుసగా గ్రూప్‌–1 పోస్టులు సాధించాను. తాజాగా డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. సివిల్స్‌ ర్యాంకు సాధించడమే లక్ష్యంగా చదువుతాను.

– సువర్ణ, గ్రూప్‌–1 విజేత

#Tags