Skip to main content

Olympics: పేవ్‌మెంట్‌ నుంచి ఒలింపిక్స్‌ వరకు

చేతిలో చిల్లిగవ్వ లేక΄పో యినా సరే...  ఆత్మస్థైర్యంతో ఆకాశంకేసి చూడాలి. పెద్ద కలలు కనాలి. కష్టపడి సాధించాలి. కల నెరవేరిన తరువాత  ఆకాశంలో ఉండి΄పోకూడదు. మన ΄పాదాలెప్పుడూ నేల మీదే ఉండాలి. మన దేశంలోని జులేఖ, ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు... 
జులేఖ
జులేఖ

పేవ్‌మెంట్‌ల దగ్గర భిక్షాటన చేసిన అమ్మాయి ఆ తరువాత కాలంలో ఒలింపిక్స్‌లో ΄పాల్గొనే స్థాయికి చేరుకుంది. ఇది సినిమా కథ కాదు. నిజ జీవిత కథ. ముంబైకి చెందిన జులేఖ కథ. అనాథాశ్రమంలో పెరిగిన జులేఖ వాలీబాల్‌ ఆటలో ప్రావీణ్యం సంపాదించింది. ఆ ఆట ఆమెను అబుదాబి స్పెషల్‌ ఒలింపిక్స్‌ వరల్డ్‌ సమ్మర్‌ గేమ్స్‌లో ΄పాల్గొనేలా చేసింది.
మంచం మీద పడుకోవడం ‘లగ్జరీ’ విషయమేమీ కాదు. జులేఖ షేక్‌కు మాత్రం లగ్జరీనే!


పదహారు సంవత్సరాల క్రితం శుక్రాపూర్‌ హైవేపై ఎనిమిదేళ్ల జులేఖా షేక్‌ కాలికి గాయమై పడి ఉండడాన్ని ΄పోలీసులు గమనించి చికిత్స కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
ఆ ఆసుపత్రిలో జులేఖ ఫ్యాన్‌ కింద బెడ్‌పై పడుకుంది. ఇది తనకు సరికొత్త అనుభవం. కటిక నేల మీద తప్ప ఆమె ఎప్పుడూ బెడ్‌ మీద పడుకోలేదు. భిక్షాటన చేయడం, ఏదో ఒకటి తిని కడుపు నింపుకోవడం, రాత్రి పడుకోవడానికి స్థలం వెదుక్కోవడం... స్థూలంగా ఇది తన జీవితం.

julekha
ఆసుపత్రి నుంచి బయటికి వచ్చిన తరువాత జులేఖను ఒక అనాథాశ్రమంలో చేర్పించారు ΄పోలీసులు. అలా ఆమెకు అనికేత్‌ సేవాభవి సంస్థ నిర్వాహకురాలు కల్పన వర్పే పరిచయ భాగ్యం కలిగింది. ఆ తరువాత జులేఖ జీవితమే మారి΄పోయింది.
కట్‌ చేస్తే... అబుదాబి 2019 స్పెషల్‌ ఒలింపిక్స్‌ వరల్డ్‌ సమ్మర్‌ గేమ్స్‌లో వాలీబాల్‌లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించడమే కాదు కాంస్య పతకం గెలుచుకుంది. ఇప్పుడు ఆ పతకం తనకు పతకం మాత్రమే కాదు... కొత్త జీవితం... కొత్త శక్తి! ఈ పతకం గురించి అడిగిన వారికి, అడగని వారికి అందరికీ చూపిస్తూ ఎంతోసేపు సంతోషంగా మాట్లాడుతుంది జులేఖ.

గతంలోకి వెళితే...

గ్రౌండ్‌లో అబ్బాయిలు వాలీబాల్‌ అడుతున్నారు. ‘సర్, నేను ఆడవచ్చా’ అని స్పోర్ట్స్‌ టీచర్‌ అశోక్‌ రామచంద్రన్‌ నాంగ్రాను అడిగింది జులేఖ. ‘కుదరదు’ అని ఆయన అని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఆయన పచ్చ జెండా ఊపడంతో గ్రౌండ్‌లోకి అడుగుపెట్టింది. రోజులు గడుస్తున్న కొద్దీ అబ్బాయిలతో సమానంగా, వారిని మించి వాలీబాల్‌ ఆడడం మొదలుపెట్టింది. ఆ ప్రతిభ తనని రాష్ట్ర, అంతర్‌రాష్ట్ర స్థాయిలో ఎన్నో గేమ్స్‌ ఆడేలా చేసింది. అబుదాబి ఒలింపిక్స్‌ కోసం తొలిసారి విమానం ఎక్కడం జులేఖ జీవితంలో మరచి΄పోలేని మధురమైన అనుభవం.
‘బాల్యంలో ఎన్నో కష్టాలు పడి ఉండడం వల్ల మొదట్లో చాలా హైపర్‌గా కనిపించేది. ఆలోచనలు స్థిరంగా ఉండేవి కాదు. ఆ తరువాత ఆమెలో ఎంతో మార్పు వచ్చింది. ఏదైనా సాధించి తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదల పెరిగింది’ అంటుంది జులేఖ గురించి కల్పనా వర్పే.

Also read: Miss Universe 2024: వైకల్యం విజయానికి అడ్డంకి కాదు.. అందాల పోటీలో కిరీటం ధరించి చరిత్ర సృష్టించిన తొలి బధిర మహిళ

‘రాత్రి పడుకోవడానికి చోటు వెదుక్కోవడం ఒకప్పుడు కష్టంగా ఉండేది. అనాథాశ్రమంలో చేరిన తరువాత ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నట్లే ఉండేది. ఎన్నో పద్ధతులు నేర్చుకున్నాను. సెలవుల్లో అమ్మడానికి మట్టి ప్రమిదల నుంచి గ్రీటింగ్‌ కార్డ్స్‌ తయారు చేయడం వరకు ఎన్నో చేశాను’ అని గతాన్ని గుర్తు చేసుకుంది జులేఖ. కొత్త జీవితాన్ని ఇచ్చిన అనికేత్‌ సేవాభవి సంస్థకు తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకుంది.


‘ఇక్కడి వారి పట్ల ఆమె చూపుతున్న శ్రద్ధ, ప్రేమ అపురూపంగా అనిపిస్తుంది. చుట్టుపక్కల నుంచి వచ్చిన వారికి వేడి వేడి చాయి చేసి ఇస్తుంది. వారికి ధైర్యం చెబుతుంటుంది’ అని జులేఖ గురించి ప్రశంసాపూర్వకంగా చెబుతుంది కల్పనా వర్పే. ఒకప్పటి జులేఖలాంటి అమ్మాయిలు ఇప్పుడు కూడా ఫుట్‌పాత్‌ల మీద కఠినమైన జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు. అలాంటి వారికి కొత్త జీవితం ఇవ్వాలనేది జులేఖ కల. 

Also read: The Inspiring Journey of Tanisha: 12 సంవత్సరాలు వైకల్యాన్ని దాచిపెట్టిన బంగారు పతక విజేత!

Published date : 21 Aug 2024 08:12PM

Photo Stories