Women Achieves 3 Govt Jobs Success Story : ప్రతీ ప్రయత్నంలోనూ విఫలమే.. సివిల్స్ నిర్ణయంపై ఆత్మీయులే విమర్శలు.. చివరికి మూడు ప్రభుత్వ ఉద్యోగాలతో..
సాక్షి ఎడ్యుకేషన్: ఒక రంగంలో గెలుపు సాధించాలంటే ఇతరుల సహకారం ఉండడమే కాకుండా మనలో మనకే నమ్మకం ఉండాలి, సాధించగలను అనే పట్టుదల ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చిన, ఎన్ని ఓటములు ఎదురైనా ధైర్యంగా నిలిచి గెలుపుకు వేచి చూడాలి. చాలామంది అనుకున్నది సాధించి గొప్ప గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే, ఆ గెలుపుకు వెనుక ఉన్న కష్టాలు, ఎదురుకున్న అవమానాలు వంటి విషయాలు ఎవరికీ తెలియదు.
ఇటువంటి దారిలో నడిచి, అన్నింటినీ ఎదుర్కొని చివరకు తన కలను సాకారం చేసుకున్న ఓ యువతి భవ్య.. ఈ అమ్మాయి కూడా ఎన్నో ఇబ్బందులు, అవమానాలు, ఓటములను ఎదుర్కొని చివరికి చాలామంది యువకులకు ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతం, మనం తెలుసుకుంటున్న విజయగాధ ఈ యువతి గురించే..
ప్లేస్మెంట్‌ను వదులుకొని..
భవ్య.. ఈ యువతిది గురటూరు జిల్లా, ఇంజనీరింగ్ పూర్తి చేసుకొన్న అనంతరం, క్యాంపస్ ప్లేస్మెంట్‌లో ఉద్యోగం దక్కింది. కాని, తను ఎంచుకున్న రంగం వేరు కాగా, ఆ ఉద్యోగాన్ని తిరస్కరించింది. అనంతరం, తనకు ఇష్టమైన ప్రజాసేవను ఎంచుకుంది. ఈ దారిలో వెళ్లాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాల్సిందే. ఇలా, ఎంచుకున్న రంగమే ఐఏఎస్ ఆఫీసర్.. ఈ విషయం తెలుసుకున్న కొందరు ఆత్మీయులు తన నిర్ణయాన్ని విమర్శించారు. తనను ఎన్నో మాటలు అన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదు. తన తల్లిదండ్రులు కూడా తనకు సహకరించడంతో ఎంతో ఆనందనంగా ముందడుగులు వేసింది.
Modem Vamsi Success Story: కూలీగా మొదలైన ప్రస్థానం.. ఇప్పుడు కామన్‌వెల్త్ వరకు
ప్రయత్నాలన్నీ విఫలమే.. కాని..
ఈ సమయంలోనే కొన్ని మంచి ఇన్‌స్టిట్యూట్స్‌లో సివిల్స్ కోసం కోచింగ్ దక్కింది. తనకు సివిల్స్ కొత్త అయినప్పటికీ అందులో పట్టు సాధించేందుకు సమయం పట్టినా తన పట్టుదలతో సాధించింది. ఇలా, తనకు అడ్డుగా వస్తున్న ప్రతీ విషయాన్ని మనుషుల్ని తను ఎదుర్కుంటూ నడిచింది. తన చదువుకు, పట్టుదలకు, కష్టానికి అంత తేలికగా ఫలితం దక్కలేదు. తన మొదటి ఐదు ప్రయత్నాలు విఫలమైయ్యాయి.
దీంతో కొంతకాలం, తన పట్టుదలను కోల్పోయింది. కాని, తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, తన ఓటమి నుంచి దక్కిన పాఠాలు తనకు మరింత ప్రోత్సాహానిచ్చింది. దీంతో మళ్లీ తేలుకొని ప్రయత్నాలు ప్రారంభించింది. ఇకపోతే, ఆరో ప్రయత్నానికి ఫలితంగా.. 2023 నవంబర్‌లో ఇండియన్ రైల్వే ఇంజనీరింగ్ సర్వీస్ కు భవ్య సెలెక్ట్ అయింది.
ఒకేసారి మూడు ఆఫర్లు..
ఆరు ప్రయత్నాలు.. అంటే, ఆరేళ్లు తన కష్టం, పట్టుదలకు దక్కిన ఫలితం. కాని, తనకు ఇంకా ఎన్నో ఇబ్బందులు, ఎదురు దెబ్బలు ముందు తగులుతాయని అర్థమైయ్యాక భవ్య ఈ రంగాన్ని వదులుకోవాలని నిర్ణయించుకుంది. కాని, ఈ సమయంలోనే తనకు గ్రూప్స్ లో ఎంపిడిఓ పోస్ట్ రావడంతో తనలో ప్రోత్సహం మరింత పెరిగింది. అలా, తను సాధించిన ఉద్యోగం చూస్తూనే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యింది.
ఆదర్శ ప్రయాణం..
ఇలా, 2023 ఆగష్టులో స్పోర్ట్స్ ఆథారిటీ అఫ్ డైరెక్టర్ గా సెలెక్ట్ అయింది. అలాగే, తను అనుకున్న యూపీఎస్సీ ఫలితాల్లోనూ తన పేరు ఉండడంతో తన కల నిజమైందని తేలింది. దీంతో తనతోపాటు, తన కుటుంబం, ఆత్మీయులే కాదు తనను విమర్శించిన వారంతా తనను అభినందించారు. ఇలా, తన పట్టుదలతో వచ్చిన ప్రతి కష్టాన్ని ఎదుర్కొని చివర్లో గెలుపును అందుకుంది. తన ఈ ప్రయాణం ప్రతీ యువతీయువకులకు ఆదర్శమే.