Success Story of CMA Rankers : జ‌వ‌హార్ విద్యార్థినుల‌కు జోహార్.. సీఎంఏలో ఉత్త‌మ ర్యాంకులు..

ఇటీవ‌లె విడుద‌లైన సీఎంఏ ఫ‌లితాల్లో ఉత్త‌మ ర్యాంకులు సాధించారు ఈ యువ‌తులు. అయితే, వీరిద్ద‌రూ వేర్వేరు ప్రాంతాల్లోని న‌వోద‌య విద్యార్థులు కావ‌డం విశేషం. ఇదే వీరి క‌థ‌..

అన్న‌మ‌య్య‌: సీఎంఏ పరీక్ష ఫలితాల్లో ఇద్దరు విద్యార్థులు మెరిసి అందరి మన్ననలు పొందారు. ఈ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మండలంలోని కన్నెమడుగుకు చెందిన కె.రఘరామిరెడ్డి, నాగవేణి దంపతుల కుమార్తె తేజస్విని ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంకు సాధించింది. సామాన్య రైతు కుటుంబలో పుట్టిన తేజస్విని చిన్నతనం నుంచి పట్టుదలతో చదివి నవోదయలో సీటు దక్కించుకుంది. ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించింది. సీఏ చదవాలనే లక్ష్యంతో మాస్టర్‌మైండ్స్‌ కాలేజీలో చేరింది.

Pranjali Awasthi Sucess Story: 16 ఏళ్లకే రూ.100 కోట్ల కంపెనీ.. ఈ అమ్మాయికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే!

జూలై నెలలో విడుదలైన సీఏ పరీక్ష ఫలితాల్లో ఆలిండియాలో 14 ర్యాంకు సాధించుకుంది. శుక్రవారం విడుదలైన పరీక్ష ఫలితాల్లో ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకు సాధించి శభాష్‌ అనిపించుకుంది. గురువుల బోధన, ప్రోత్సాహంతోనే ఉత్తమ ఫలితం సాధ్యమైందని ఆ విద్యార్థిని తెలిపారు. ఇంటి వద్ద రోజూ తల్లిదండ్రులు పడే కష్టం కళ్లారా చూసి, ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యంతో కసి, పట్టుదల పెరిగిందన్నారు. ఇందుకు గురువుల బోధించిన తీరు, వారి ప్రోత్సాహంతో ప్రణాళికబద్ధంగా చదివానని పేర్కొన్నారు. అనుకున్న ఫలితం దక్కించుకున్నానని వివరించారు.

మదనపల్లె విద్యార్థిని ప్రతిభ

ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంట్స్‌ ఆఫ్‌ ఇండియా (సీఎంఏ) శుక్రవారం ఫైనల్‌ ఇంటర్‌ ఫలితాలను ప్ర‌క‌టించ‌గా.. ఇందులో మదనపల్లె పట్టణం ఎస్‌బీఐ కాలనీకి చెందిన వై.వర్షితరెడ్డి ఆల్‌ ఇండియా 19వ ర్యాంకు సాధించింది.

జూన్‌ నెలలో పరీక్షలు జరిగాయి. ఇందులో వర్షితరెడ్డి ప్రతిభ కనబరిచింది. ఇటీవల విడుదల చేసిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) సీఏ ఫైనల్‌, సీఎ ఇంటర్‌ ఫలితాల్లోనూ ఆల్‌ ఇండియా స్థాయిలో 37వ ర్యాంకు సాధించింది.

Brothers Success Story : గిరిపుత్రులు కలలు కన్నారు.. యూపీఎస్సీ ఫలితాల్లో స‌క్సెస్ అయ్యారిలా.. కానీ వీళ్లు మాత్రం..

తండ్రి వై.సోమశేఖర్‌రెడ్డి మదనపల్లె ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్నారు. తల్లి నందిని గృహిణి. వర్షితరెడ్డి పదో తరగతి వరకు స్థానిక జవహర్‌ నవోదయలో చదివింది. ఇంటర్మీడియెట్‌ గుంటూరు మాస్టర్‌మైండ్స్‌లో చదివింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల సహకారంతో ర్యాంకు సాధించినట్లు వర్షితరెడ్డి తెలిపారు.

Aakarshana Satish Success Story: ఆ ఆహ్వానం అందుకున్న ఒకే ఒక్క అ‍మ్మాయి.. 12 ఏళ్లలో 15 లైబ్రరీలు

#Tags