Success Story of a Mother : ముగ్గురు ఆడపిల్లల జీవితాల్లో వెలుగున ఒంటరి తల్లి.. ఇదే ఆ అమ్మ పోరాటం కథ..
సాక్షి ఎడ్యుకేషన్: ఆడపిల్ల పుట్టిందంటేనే ఇంటికి భారం అంటూ లేదా ఇంకేదైనా వంకతో వదిలించుకోవాలనుకునేవారు. ఇప్పుడు ఇంతలా లేకపోయినా, కొన్ని చోట్లలో ఇంకా ఆడపిల్లలు పుడితే ఇంటికి భారంగా భావిస్తారు. వారు ఏం చేయలేరని, ఇంటికి మాత్రమే పరిమితమవ్వాలని, వంటిల్లే ఆడవారికి ప్రపంచమని కొందరు ఇప్పటికి భావిస్తారు. ఇటువంటి ఒక జీవితం చూసినవారి కథే ఇప్పుడు మనం తెలుసుకోనున్నాం..
మాచిట్లి బంగారమ్మ.. ముగ్గురు ఆడపిల్లల తల్లి. ఆమె శృంగవరపు కోటలో శ్రీనివాస్ కాలనీకి చెందిన మహిళ. అయితే, తనకు ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారన్న విషయం తెలుసుకున్న తన భర్త వారిని తాను పోషించలేనని, ఇది తన వల్ల కాదని వదిలి వెళ్లిపోయారు. అయితే, అప్పటినుంచి ఇల్లు, పిల్లల బాధ్యత ఆ తల్లిమీదే పడింది. మొదట్లో ఎంత బాధ కలిగించినా, తన పిల్లల బాధ్యత గుర్త చేసుకోని ధైర్యంగా నిలిచేది ఆ తల్లి. తన బాధ్యతను వదిలి వెళ్లిపోయిన తండ్రికి ఆడపిల్లలను పెంచి పెద్ద చేసి, వారిని ఉన్నత స్థాయిలోకి చేర్చి, అందరి భావాలను మార్చాలనుకుంది. అందుకే ఎంత కష్టమైనా ముగ్గురిని చదివించాలనుకుంది.
☛Follow our YouTube Channel (Click Here)
రోజూ కూలీతో..
తన పిల్లలను గొప్ప స్థానంలో నిలబెట్టాలనుకున్న బంగారమ్మ.. దినసరి కూలీకి వెళ్లడం ప్రారంభించింది. అలా, రోజు వచ్చే డబ్బులను కూడబెట్టుకొని ముగ్గురు పిల్లలను స్కూలుకు చేర్చింది. ఆ ముగ్గురు పిల్లలు కూడా గొప్పగా చదివి వారి తల్లికి సహాయపడాలనుకునే వారు. బంగారమ్మ పెద్ద కూతురు రేవతి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివింది.
ఆర్థిక ఇబ్బందులతో
తన తల్లి పడే కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు చూసి తన చదువును ఆపేయాలనుకుంది. కాని, తన ప్రతిభ, చదువు, తెలివిని చూసిన స్థానిక పుణ్యగిరి విద్యాసంస్థల అధినేత ఎల్ సత్యనారాయణ తన కాలేజ్‌లో ఉచితంగా ఇంటర్మీడియెట్ ప్రవేశం కల్పించారు. అంతేకాకుండా, రేవతి ఎంత వరకు చుదువుతుందో అంత వరకు తనదే బాధ్యత అని హామీ కూడా ఇచ్చారు. ఇలా, తను ఇంటర్‌లో 984 మార్కులు సాధించగా, ఎంసెట్‌లో కూడా ఉన్నతంగా మెరిసింది.
☛ Follow our Instagram Page (Click Here)
దీంతో తనకు గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్‌లో సీటు వచ్చింది. 2019 లో జగన్ మోహన్ రెడ్డి భర్తీ చేసిన సచివాలయ ఉద్యోగాల్లో ధర్మవరం సచివాలయం లో అసిస్టెంట్ ఇజనీర్ పోస్ట్ దక్కించుకుంది. ఆ తర్వాత ఏపీపీఎస్సీ పరీక్షలు రాసి అందులోనూ ఉత్తీర్ణత సాధించి ప్రస్తుతం జోన్ – 1 పరిధిలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం లో ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఈఈగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మరో ఇద్దరూ..
మరో ఇద్దరు సరస్వతి, పావని కూడా విద్యావంతురాలే. వీరు కూడా ఉన్నతంగా చదువుకున్నారు. సరస్వతి.. ఏలూరులోని సచివాలయంలో ఉద్యోగిని అయితే, చిన్నమ్మాయి పావని పీహెచ్‌డీ చేస్తోంది. వీరు కూడా తమ తెలివితో ఉన్నత విద్యాలు పొంది గొప్ప ఉద్యోగాలను సాధించారు. వీరంతా ఒక్కటిగా నిలిచి తన తల్లి పడ్డ కష్టాలన్నీ వారి విజయాలతో మర్చిపోయేంతలా ఎదిగారు.
తన ముగ్గురు కూతుర్ళ విజయాలను చూసిన ఆ తల్లి సంతోషానికి అవధులు లేవు. వారి తండ్రి అందరినీ వదిలి వెళ్లినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా తమ పిల్లలని ప్రస్తుతం, ఉన్నత చదువులు, గౌరవ ప్రధమైన ఉద్యోగాలతో స్థిరపడేలా రెక్కలిచ్చింది.