CA Success Story: తండ్రి ప్రోత్సాహంతో దేశంలోవ్యాప్తంగా ఈ ర్యాంకును సాధించింది..!
యూపీఎస్‌సీ పరీక్షలు రాయాలంటే ఎంతో పట్టుదల, ఆత్మ విశ్వాసం ఉండాలి. ఎన్నిసార్లు ప్రయత్నించాల్సి వచ్చినా కూడా ముందుకు సాగేంత ఆత్మస్థైర్యం ఉండాలి. ఇటువంటి మరో పరీక్షే సీఏ.. ఈ పరీక్షలో నెగ్గాలన్నా కూడా చాలా కృషి, పట్టుదలతోపాటు ఆత్మ విశ్వాసం ఉండాలి. అలా అయితేనే ముందుకు వెళ్లగలుగుతారు. సీఏ అంటే.. చార్టెడ్ అకౌంటెన్ట్స్. ఈ పరీక్ష కూడా ప్రతీ ఏడాది ఉంటుంది.
ఎప్పటివరకు ఎంతోమంది ఇందులో నెగ్గి ఒక గొప్ప స్థాయిలో నిలిచారు. అలా గతేడాది (2023)లో జైపూర్ నుంచి విషేష్ కాబ్రా, ప్రియా అగర్వాల్, ఆయూష్ కటరియా, హర్షికా ఖన్దెల్వాల్ తోపాటు ప్రనవ్ ధూత్ వంటి పలు విద్యార్థులు సీఏ పరీక్షను రాసి నెగ్గినట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్ట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) వారు వెల్లడించారు. ఈ విద్యార్థుల ర్యాంకులు గొప్ప స్థానంలో నిలిచింది. ఎంతో కృషి చేస్తే కాని ఈ గెలుపును పొందలేరు. కానీ, వీరిని దాటుకొని అందరికీ ఆదర్శంగా నిలిచి, అందరి చూపులను తన గెలుపువైపుకే మళ్ళుకుంది ఈ విద్యార్థులని. ఇప్పుడు ఈ నేపథ్యంలో విద్యార్థిని అందుకున్న గెలుపుకు ప్రయాణం మీకోసం..
Santosh Lakshmi: ‘నాడు సర్పంచ్.. నేడు న్యాయమూర్తి’.. జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన మహిళ
ఎన్నో అడ్డంకులను దాటుకొని తన కష్టంలో కూడా ముందుకే నడుస్తూ గెలిచింది. అందరికీ ఆదర్శంగా నిలిచింది హర్షికా ఖన్దెల్వల్.. దేశంలోనే 16వ ర్యాంకును దక్కించుకుంది. జీవితంలో ఎటువంటి కష్టాలు ఉన్నా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి చేరుకోగలగాలి అని నిరూపించింది ఈ విద్యార్థిని.
ఇంటర్‌కి ముందు-తరువాత:
తను ఇంటర్‌లో ఎప్పడూ చదువులో ముందే ఉండేది. ఎంతో చురుగ్గా ఉంటూ తన స్నేహితులకు కూడా చెప్పేది. ఆ గెలుపే తనకు ఎంతో స్పూర్తిని ఇచ్చింది. కానీ, తన సీఏ పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో ఎన్ని విధాలుగా మాక్ టెస్టులు తీసుకున్న కూడా అన్నింటిలో వెనకబడింది. దీంతో తను ధైర్యాన్ని కోల్పోవడం మొదలైంది. అలా, కొన్నిసార్లు జరగగా ఒటమిని అంగీకరించే స్థితికి పోయింది. దీంతో తీవ్ర నిరాశతోపాటు భయాందోళనకు గురైంది.
DSP Inspire Success Story : ఈ లేడీ పోలీస్ కేసు టేకప్ చేశారంటే.. నిందితుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తినట్లే.. ఈమె సక్సెస్ స్టోరీ ఇదే..
తండ్రి ప్రోత్సాహంతోనే..
ఈ పరిస్థితిలోకి రాగానే తన పెర్ఫార్మెన్స్ మరింత దిగిపోయింది. ఈ కారణంగా.. తను ఎంత చదివినప్పటికీ పాఠాలు గుర్తు ఉండేవి కాదు. సరిగ్గా ఈ సమయంలోనే తనకు తన తండ్రి అండగా నిలిచారు. తన ఆరోగ్య విషయం గురించి తెలుసుకున్న తన తండ్రి తనను మళ్లీ మామూలు మనిషి చేసేందుకు ఎంతో కృషి చేశారు. తనకు అనేక విధాలుగా ప్రోత్సాహించి ముందుకు నడిపించారు. తను చదువులో ఎంత చురుగ్గా ఉండేదో తిరిగి అదే విధంగా తీర్చిదిద్దారు. ఈ విషయంలో మాత్రం తన తండ్రి ఒక కీలక పాత్ర పోషించారనే చెప్పాలి.
అలా, తన తండ్రి చెప్పిన మాటలు, చేసిన సహాయం కారణంగా ఒత్తిలోంచి బయటకి వచ్చిన హర్షికాకు మళ్లీ మొదటిలాగే తనకున్న ఆత్మ విశ్వాసం దక్కింది. అనంతరం, మాక్‌టెస్ట్‌లను ప్రారంభించింది. అందులో మంచి మార్కులతో నెగ్గింది. తన తండ్రి తనలో నింపిన ప్రోత్సాహమే తన జీవితాన్ని మార్చింది అని చెప్పొచ్చు.
16వ ర్యాంకుతో..
ఇక తన అందిన ప్రోత్సాహంతో హర్షిక తన తెలివి, కష్టం, పట్టుదలతో తన ఇంటర్ పరీక్షకు సిద్ధమైంది. అలాగే, దేశంలోనే 16వ ర్యాంకును సాధించి ప్రతీ విద్యార్థికి స్పూర్తిగా నిలిచింది.
ASP Success Story : తినడానికి సరైన తిండి లేక.. యూనివర్సిటీలో చేరా.. కానీ అక్కడ..
ఒక ఉదాహరణగా..
హర్షికా ప్రయాణం ఒక ఉదాహరణగా మారింది.. జీవితంలో మనకు ఎన్నో కష్టాలు, ఎంతోమంది నుంచి విమర్శలు వివిధ మాటలు ఎదురవుతాయి. వాటన్నింటినీ దాటుకునే దారిని వెతకాలే కానీ మన ప్రయాణాన్ని ఆపకూడదు అని అర్థం చేసుకోవాలి. ఒకరి తోడు ఉన్న లేకపోయినా మనం చేరుకోవలసిన గమ్యాన్ని చేరుకునే ప్రయత్నంలోనే ఉండాలి. తనకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలిచిన తన తండ్రిలాగే ప్రతీ ఒక్కరికి వారి తల్లిదండ్రులు స్పూర్తిగా, అండగా నిలిచి, వారి పిల్లలను ప్రోత్సాహించాలి. విద్యార్థులు కూడా తమకు ఎదురయ్యే కష్టాలను దాటుకొని నడవాలి గాని, కృంగిపోకూడదు.