Australia Student Visa: భారీగా పెరిగిన ఆస్ట్రేలియా స్టూడెంట్‌ వీసా ఫీజు.. భారతీయులపై తీవ్ర ప్రభావం

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా స్టూడెంట్‌ వీసా ఫీజును రెట్టింపునకు మించి పెంచింది. ప్రస్తుతం 710 డాలర్లు (రూ.59,255)గా ఉన్న ఫీజును 1,600 డాలర్లు (రూ.1.33 లక్షల)కు పెంచింది. పెంచిన ఫీజులు అమలవుతాయని జూలైæ ఒకటో తేదీ నుంచి తెలిపింది. 

దీని ప్రభావం ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే లక్షలాది మంది భారతీయ విద్యార్థులపై పడనుంది. ఆస్ట్రేలియాలో విదేశీ విద్యార్థుల్లో భారతీయులది రెండో స్థానం.

AP Open school Results 2024:ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ ఓపెన్‌ స్కూల్‌ ఫలితాలు విడుదల

2023 ఆగస్ట్‌ నాటికి 1.2 లక్షల మంది భారతీయ విద్యార్థులున్నట్లు కాన్‌బెర్రాలోని భారత హైకమిషన్‌ తెలిపింది. ఇకపై విదేశీ విద్యార్థులు బ్రిటన్‌ వంటి దేశాలను ఎంచుకోవచ్చంటున్నారు. కునే బ్రిటన్‌లో స్టూడెంట్‌ వీసా ఫీజు 900 డాలర్లు(రూ.75 వేలు)గా ఉంది.

#Tags