Telangana Medical Jobs 2024 : 5348 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్.. త్వ‌ర‌లోనే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : 5,348 పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ స‌ర్కార్ ప‌చ్చ‌జెండా ఊపింది. ప్ర‌జారోగ్యం, ఆయుష్‌, డీసీఏ, ఐపీఎం, డీఎంఈ, వైద్య విధాన ప‌రిష‌త్‌, ఎంఎన్‌జే క్యాన్స‌ర్ ఆస్ప‌త్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

ఇన్నిరోజులు ఎన్నిక‌ల కోడ్ వ‌ల్ల ఆగిపోయిన ఈ పోస్టుల భ‌ర్తీ.. ఎన్నిక‌ల కోడ్ ముగియ‌డంతో.. ఈ పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ ముందుకు సాగ‌నున్న‌ది. ఈ నియామ‌కాల‌ను వైద్యారోగ్య స‌ర్వీసుల నియామ‌క బోర్డు ద్వారా నేరుగా చేప‌ట్ట‌నున్నారు. ఇందుకోసం స్థానిక‌త ఆధారంగా ఉన్న ఖాళీలు, రోస్ట‌ర్ పాయింట్లు, అర్హ‌త‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఆయా విభాగాల అధిప‌తుల నుంచి తీసుకోవాల‌ని చెప్పారు. ఆయా వివరాల ఆధారంగా నోటిఫికేష‌న్ ఇచ్చి నేరుగా ఖాళీల‌ను భ‌ర్తీ చేయాల‌ని తెలిపారు.

➤ June 17th Holiday : జూన్ 17, 25న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. కార‌ణం ఇదే..!

26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో..
అలాగే ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వైద్యారోగ్య సర్వీసు నియామక బోర్డు ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్‌లో 3235 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 1255 పోస్టులు భర్తీ చేయనుంది. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ లో 11, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటిక్ మెడిసిన్‌లో34 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అలాగే వైద్యశాఖలో ఖాళీలను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతిస్తూ మార్చి 12వ తేదీన‌ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2021 అక్టోబర్ నుంచి ఖాళీగా ఉన్న 4356 పోస్టులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేయాలని ఆదేశించింది. ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రావాల్సి ఉంది.

#Tags