Jobs: ఈఎంటీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు సిటీ: జిల్లాలోని 108 వాహనాల్లో ఈఎంటీ పోస్టులకు అర్హులు న‌వంబ‌ర్ 8లోపు దరఖాస్తు చేసుకోవాలని జోనల్‌ మేనేజర్‌ రాకేష్‌ న‌వంబ‌ర్ 2న‌ ఒక ప్రకటనలో కోరారు.

ముత్తుకూరు, మనుబోలు, రాపూరు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, లింగసముద్రం, గుడ్లూరు, దగదర్తి, కావలి తదితర మండలాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు.

చదవండి: Telangana Govt Jobs: తెలంగాణ వైద్య కళాశాలల్లో ఫ్యాకల్టీ పోస్టులు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

జీఎన్‌ఎం, బీఎస్సీ, నర్సింగ్‌, బీఎస్సీ లైఫ్‌ సైన్సెస్‌లో ఐదేళ్లు అనుభవం కలిగి.. క్యాథ్‌ల్యాబ్‌, డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, అనస్థీషి యా తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. దరఖాస్తులను డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోని 108 ఆఫీస్‌లో అందజేయాలని కోరారు. వివరాలకు 83284 61648, 96420 27098 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

#Tags