Government Jobs Reservation Increased : వీళ్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ పెంపు...!
రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు నాలుగు లక్ష్యాలతో పాలసీకి రూపకల్పన చేయాలని సూచించారు.
ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలిస్తే.. రూ.7 కోట్లు..
ఒలింపిక్స్, ఆసియా గేమ్స్ విజేతలకు ఇచ్చే ప్రోత్సాహకం భారీగా పెంచాలని సీఎం నిర్ణయించారు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలిస్తే ఇచ్చే ప్రోత్సాహకం రూ.75 లక్షల నుంచి రూ.7 కోట్లకు పెంచాలని ఆదేశించారు. నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.10 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.5 లక్షలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.3 లక్షల ప్రోత్సాహం ఇవ్వాలని ప్రతిపాదించారు. ఏసియన్ గేమ్స్‌లో పాల్గొన్న వారికి రూ.10 లక్షలు ఇవ్వాలని సూచించారు. వరల్డ్ ఛాంపియన్ షిప్, వరల్డ్ కప్ పోటీల్లో బంగారు పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.35 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.25 లక్షలు ఇవ్వనున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా...
అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3 శాతానికి పెంచుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.