Good News For Telangana unemployed Candidates : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ.. ఫిబ్రవరి నుంచే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలో కొత్త‌గా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎట్టి ప‌రిస్థితుల్లో.. ప్రభుత్వ‌ ఉద్యోగాల ఖాళీలను వెంటనే రెడీ చేయాలని ఆర్థిక శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఇక ఆర్థిక శాఖ ఖాళీలపై అప్రూవల్ ఇస్తే తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) జాబ్ నోటిఫికేషన్ల ప్రక్రియ ఫిబ్రవరి నెల  మొద‌టి వారం నుంచే ప్రారంభం కానుంది. ఇటీవ‌లే టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా మహేందర్ రెడ్డితో పాటు సభ్యులు కూడా బాధ్యతలు చేపట్టిన విష‌యం తెల్సిందే.

జాబ్ క్యాలెండర్ ప్ర‌కారంమే ఈ ఏడాదిలో..
త్వరలోనే ముఖ్య‌మంత్రి టీఎస్పీఎస్సీ స‌భ్యుల‌తో సమీక్ష స‌మావేశం నిర్వహించనున్నారు. యూపీఎస్సీ తరహాలో ప్రతి ఏడాది ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టేలా కొత్త బోర్డు ప్రభుత్వం, ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకోనున్నట్లు తెలిసింది. అభయ హస్తం హామీల్లో భాగంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఫిబ్రవరి 1 నుంచి డిసెంబర్ 15లోగా పూర్తి చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటికే ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకునే వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది.

లోక్ సభ ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీపై కసరత్తు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీచర్ల రిక్రూట్మెంట్‌కు సంబంధించి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేయాలని రేవంత్ అధికారులను ఆదేశించారు.

బీఆర్ఎస్ సర్కారు తొమ్మిదేళ్లలో ఒక్క డీఎస్సీ వేయకపోగా 5వేల టీచర్ల పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్‌లో నోటిఫికేషన్ వేయగా ఎన్నికల కారణంగా పరీక్షలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో 5వేల ఉద్యోగాలకు మరో 7 వేల ఉద్యోగాలు కలిపి మొత్తం 12వేల టీచర్ల ఉద్యోగాలకు మెగా డీఎస్సీ వేయాలని రేవంత్ రెడ్డి ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మొత్తంనికి తెలంగాణ‌లో మ‌ళ్లీ ఉద్యోగాల జాత‌ర ఫిబ్ర‌వ‌రి నెల నుంచి ప్రారంభం కానుంది.

#Tags