Government Jobs Notifications 2024 : 53000 ఉద్యోగాలు... ఈ ఏడాదిలోనే.. ఎలా అంటే...?
ఉద్యోగాలు ఇవే..
డీఎస్సీ ద్వారా 11,062 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. అలాగే 8,304 గురుకులం ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. గ్రూప్-1 ద్వారా 563 పోస్టులు, అలాగే గ్రూప్-2 ద్వారా 783 ఉద్యోగాలకు, గ్రూప్-3 ద్వారా 1375 జాబ్స్, గ్రూప్-4 ద్వారా 8,143 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాం.
పోలీసు ఉద్యోగాలు కూడా...
16,067 కానిస్టేబుల్ పోస్టులకు ఫలితాలు విడుదల చేసి.. వీరికి నియామక పత్రాలు అందించాం. అలాగే మెడికల్ నియామక బోర్డు కింద 7,094 మంది స్టాఫ్ నర్సు నియామకాలను పూర్తి చేశాం. 1,284 ల్యాబ్ టెక్నీషియన్, 2,050 నర్సింగ్ అధికారులు, 633 ఫార్మాసిస్టు పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేశామన్నారు.
టైమ్ ప్రకారం నియామకాలు కొనసాగేలా..
జాబ్ కేలండర్ విడుదల చేసి.. టైమ్ ప్రకారం నియామకాలు కొనసాగేలా నూతన విధానం అమల్లోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ ప్రక్షాళన చేపట్టామని వెల్లడించింది. వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ నియామక పరీక్షలు, ఫలితాలకు ఉన్న అడ్డంకుల్ని తొలగించామన్నారు. గతంలో రద్దయిన, వాయిదాపడిన పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించి.. వీరికి నియామక పత్రాలు అందజేశామని సీఎంవో తెలిపింది.