Good News For Government Employees 2024 : దీపావళి పండుగ వేళ.. ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్ర‌భుత్వం...

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప్ర‌భుత్వం ఉద్యోగులకు... దీపావళి పండ‌గ సంద‌ర్భంగా గుడ్‌న్యూస్ చెప్పింది. న‌వంబరు జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు చేయనున్నారు. అలాగే 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

డీఏ పెంపు 2022 జులై ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని తెలిపింది. 2022 జులై ఒకటి నుంచి 2024 అక్టోబర్ 31 వరకు డీఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు.

అలాగే జీహెచ్ఎంసీ ఉద్యోగుల‌కు కూడా..
ఉద్యోగులకు జీహెచ్ఎంసీ దీపావళి శుభవార్త చెప్పంది. ఈ రోజు సాయంత్రం వరకు జీతాలు విడుదల చేయనున్నట్లు ఫైనాన్స్ డిపార్టుమెంట్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. జీహెచ్ఎంసీ రూ.120 కోట్ల నిధులను విడుదల చేయనుంది. అయితే.. జీహెచ్ఎంసీ గత నెల వారం రోజుల ఆలస్యంగా జీతాలు ఇచ్చింది. 
దసరాకు ఐదు రోజులు ఆలస్యంగా జీతాలు ఇవ్వడంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఉద్యోగుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని రెండు రోజులు ముందుగానే జీహెచ్ఎంసీ జీతాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

అలాగే పదవీ విరమణ చేసే ఉద్యోగులకు కూడా..
2025 మార్చి 31వ తేదీ లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు డీఏ బకాయిలు 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు 10 శాతం ప్రాన్ ఖాతాకు జమ చేస్తారు. 90 శాతం 2025 ఫిబ్రవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నారు. జీపీఎఫ్ ఖాతాలు లేని ఫుల్ టైం కంటింజెంట్ ఉద్యోగులకు 2025 ఫిబ్రవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేపడతారు. అలాగే విశ్రాంత ఉద్యోగులకు డీఏ బకాయిలు 2025 జనవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం వెల్ల‌డించింది.

అలాగే Deputy CM Bhatti Vikramarka Singareni Workersకి Diwali Bonusను ప్ర‌క‌టించిన విష‌యం తెల్సిందే.

#Tags