AP CM YS Jagan Mohan Reddy : దేశ చ‌రిత్ర‌లో.. రికార్డు స్థాయిలో ఒకే సారి ప్ర‌భుత్వ‌ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసిన‌ ప్ర‌భుత్వం ఇదే..

దేశ చ‌రిత్ర‌లో.. ఒకే సారి రికార్డు స్థాయిలో 1.34 లక్షల ప్ర‌భుత్వ ఉద్యోగాలను భ‌ర్తీ చేసిన ఏకైక ప్ర‌భుత్వం వైఎస్ జ‌గ‌న్ ప్రభుత్వ‌మే. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఒకే సారి 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను మంజూరు చేసి.. వాటి భర్తీకి చర్యలు చేపట్టి.. కేవ‌లం నాలుగు నెలల్లోనే నియామకాలు పూర్తి చేసి రికార్డు సృష్టించింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్.

2019 జూలై –అక్టోబర్‌ నెలల మధ్య మొదటి విడతగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసింది ప్రభుత్వం. అప్పట్లో మిగిలిపోయిన ఖాళీలకు సంబంధించి 2020 జనవరి నెలలో రెండో విడత నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ ఏడాది సెప్టెంబర్‌ నెలలో ఇందుకు సంబంధించిన రాత పరీక్షలను నిర్వహించి నియామకాలను పూర్తి చేసింది. అలాగే మెడిక‌ల్ విభాగంలో వేల సంఖ్య‌లో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేశారు. డిసెంబ‌ర్ 21వ తేదీన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సంద‌ర్భంగా.. ప్ర‌భుత్వ‌, కాంటాక్ట్ ఉద్యోగాల భ‌ర్తీలో సీఎం జ‌గ‌న్‌ తీసుకొచ్చిన చారిత్మక నిర్ణయాలపై సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్(www.sakshieducation.com) ప్ర‌త్యేక క‌థ‌నం మీకోసం..

చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో.. ఒకే సారి..
విశ్వవిద్యాలయాల్లో దశాబ్దాలుగా భర్తీకి నోచుకోని అధ్యాపక, అధ్యాప­కేతర పోస్టుల్లో నియామకాలకు శ్రీకారం చుట్టింది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 18 యూని­వర్సిటీల్లో ఏకంగా 3,220 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

☛ AP CM YS Jagan Mohan Reddy : చ‌రిత్ర‌లో ఎన్న‌డులేని విధంగా.. ఏపీ విద్యారంగంలో చేసిన విప్లవాత్మక మార్పులు ఇవే..

ఏపీపీఎస్సీ చ‌రిత్ర‌లో..
రాష్ట్రంలో ఏపీపీఎస్సీ 111 గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి.. నోటిఫికేష‌న్ ఇచ్చి గతంలో ఎన్నడూ లేని రీతిలో 11 నెలల వ్యవ­ధిలోనే ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి రికార్డు సృష్టించింది.

చదవండి: ఏపీపీఎస్సీ Group1 &2 - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌ | టీఎస్‌పీఎస్సీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) నిరుద్యోగుల‌కు ఇటీవ‌లే మ‌రో గుడ్‌న్యూస్ చెప్పినున్న‌ది. డిసెంబ‌ర్ 7వ తేదీన(గురువారం) 897 ఉద్యోగాల‌కు గ్రూప్‌-2 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. అలాగే కేవ‌లం ఒక రోజు గ‌డువులోనే డిసెంబ‌ర్ 8వ తేదీన‌(శుక్ర‌వారం) ఏపీపీఎస్సీ దాదాపు 81 గ్రూప్‌-1 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్ర‌భుత్వ‌, కాంటాక్ట్ ఉద్యోగాలను వేల సంఖ్య‌లో భ‌ర్తీ చేసిన ఏకైన ప్ర‌భుత్వం వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వమే అని గ‌ర్వంగా చెప్ప‌గ‌ల‌రు ఏపీలోని యువ‌త‌.

2019 నుంచి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం భ‌ర్తీ చేసిన ఉద్యోగ వివ‌రాలు ఇవే..

#Tags