TNPSC 2024 :గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ విడుదల....

గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ విడుదల....
TNPSC 2024 : గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ విడుదల....

కొరుక్కుపేట: తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎన్‌పీఎస్‌సీ) గ్రూప్‌ –1 , గ్రూప్‌–2 , 2ఏ , గ్రూప్‌ –4 ఇంటర్నల్‌ పోస్టుల కోసం ఏటా పరీక్షలు నిర్వహిస్తోంది. కాగా గతంలో ప్రకటించిన మేరకుగ్రూప్‌ –1 నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేసింది. ఇందులో డిప్యూటీ కలెక్టర్‌ –16, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు (డీఎస్పీ) –23, కమర్షియల్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్‌ –5, కమిషనర్‌ –14 , సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్‌ –21, గ్రామీణాభివృద్ధి శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ – 14, జిల్లాల ఉపాధి అధికారి –1, జిల్లా ఆఫీసర్‌ –1 సహా మొత్తం 90 పోస్టులు ఉన్నాయి. ఈ ఖాళీల భర్తీకి దరఖాస్తు దారులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ కలిగి ఉండాలి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్‌ 27గా పేర్కొన్నారు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారంలో మే 2 నుంచి మే 4 వరకు సవరణలు చేసుకోవచ్చు. ప్రాథమిక పరీక్ష జూలై 13న నిర్వహించనున్నారు. మరిన్ని వివరాల కోసం www.tnpsc. gov. in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

#Tags