JCJ Damerla Preethi: కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యం సాధిస్తాం

కరీంనగర్‌: సివిల్‌ సర్వీసెస్‌ శిక్షణ పొందడానికి పేద, మధ్యతరగతి, ఉన్నత కుటుంబాల విద్యార్థులనే ఎలాంటి తారతమ్యాల్లేవని, ఆత్మ నిబ్బరంతో కష్టపడి చదివితే ప్రతీ విద్యార్థి అనతి కాలంలో అనుకున్న లక్ష్యం సాధించగలుగుతారని నారాయణ సివిల్స్‌ అకాడమీలో శిక్షణ పొంది కరీంనగర్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా బాధ్యతలను నిర్వహిస్తున్న దామెర్ల ప్రీతి అన్నారు.

నారాయణ కళాశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులనుద్దేశించి నారాయణ సివిల్స్‌ అకాడమీలోని శిక్షణ ప్రాముఖ్యతను తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణ సివిల్స్‌ అకాడమీ డీన్‌ ఎ.మనోజ్‌కుమార్‌, ఏజీఎం సింగారెడ్డి, ప్రిన్సిపాల్‌ మంజులరెడ్డి, కరీంనగర్‌ నారాయణ జూనియర్‌ కళాశాల ఏజీఎం ఎస్‌.తిరుపతి, అసోసియేట్‌ డీన్‌ కె.రమేశ్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ ఆర్‌.సీతారామరాజు, కరీంనగర్‌ నారాయణ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్‌ భాస్కర్‌రెడ్డి, అధ్యాపక బృందం, మార్కెటింగ్‌ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

చదవండి:

Deeksha Battu: తొలి ప్రయత్నంలోనే జేసీజేగా ఎంపిక

Inspirational story : గిరిజన బిడ్డ‌కి 23 ఏళ్ల‌కే.. సివిల్‌ జడ్జి ఉద్యోగం.. సీఎం స్టాలిన్, సినీ ప్రముఖులు అభినందనలు.. ఇంకా..

#Tags