KGBV Jobs: కేజీబీవీల్లో కాంట్రాక్టు పద్ధతిలో నియామకం

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నడుస్తున్న కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో తాత్కాలికంగా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేసేందుకు స్పెషలాఫీసర్లు, పీజీ సీఆర్టీలు, సీఆర్టీలు, ఏఎన్‌ఎంలు, అకౌంటెంట్లు, పీఈటీలను నియమిస్తామని జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌ ఆగ‌స్టు 21న‌ తెలిపారు.

జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న కేజీబీవీ నుంచి ఇతర కేజీబీవీ స్కూళ్లకు మార్పు కోరేవారు సైతం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు. జిల్లాలో కాంట్రాక్టు పద్ధతిలో నియామకానికి ఈనెల 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయని డీఈవో వివరించారు.

చదవండి: KGBV School Admissions: కస్తూర్భా విద్యాలయాల్లో ప్రవేశాలు ఫుల్‌,ఇంగ్లీష్‌ మీడియంతో ప్రైవేటుకు ధీటుగా..

#Tags